మార్చి 16న దండుపాళ్యం-3 విడుదల

DANDUPANYAM-22
DANDUPANYAM-22

మార్చి 16న దండుపాళ్యం-3 విడుదల

దండుపాళ్యం ఈ పేరు వింటేనే కన్నడ సీమ అదిరిపోతోది.. బెంగళూరు సిటీకి ముచ్చెమటలు పట్టించిన ఓ నొటోరియస్‌ కిల్లర్‌ గ్యాంగ్‌కి పోలీసులు ఇచ్చిన బిరుదే దండుపాళ్యం.. ఆ గ్యాంగ్‌కి సంబంధించిన ఊరు పేరే ఈ దండుపాళ్యం ..కన్నడలో దండుపాళ్య అని అంటారు..
1996 నుంచి 2000 మధ్య బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాల్లో 80కిపైగా హత్యలు,రేప్‌లు, దోపిడీలు చేసిన హంతకులు ముఠా నేపథ్యంగా, యదార్ధ సంఘటనల ఆధారంగా కన్నడ దర్శకుడు శ్రీనివాసరాజా కన్నడనాట 2012లో కన్నడనాట దండుపాళ్య అనేచిత్రాన్ని తెరకెక్కించారు.. ఈచిత్రంలో ప్రముఖ శాండిల్‌ ఉండ్‌ హీరోయిన్‌ పూజాగాంధీ కీలకపాత్ర పోషించారు.

థియేటర్‌ ఆర్ట్స్‌ యాక్టర్స్‌ రవికాలే, మకరందన్‌ దేశ్‌పాండే తదితరులు ఈచిత్రంలో నటించారు. పూజాగాంధీ, రవికాలే, మకరందన్‌ దేశ్‌పాండే మినహా ఓ తొమ్మిది మంది నూతన నటీటనలుతో దండుపాళ్యం చిత్రాన్ని 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.. ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా కొద్దిగా బోల్డ్‌గా ఈసినిమాను తెరకెక్కించి అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మొదటిభాగం ఇచ్చిన ఊపుతో అదే నటీనటులతో సీక్వెల్‌గా 2014లో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది దర్శకుడు శ్రీనివాసరాజు అండ్‌ టీ.. అయితే అనివార్య కారణాల వల్ల దండుపాళ్యం రెండో భాగం 2016లో సెట్స్‌పైకి వచ్చింది.. 2017లో విడుదలై విజయాన్ని అందుకుంది.. దండపాళ్యం2లో కన్నడ హాట్‌ బ్యూటీ సంజనా కూడ నటించింది.. తాజాగా మూడో భాగంలో కూడ మొదటి రెండు భాగాల్లో నటించిన నటీనటుల్లేతీసుకుని దండుపాళ్యం 3ని రెడీ చేశారు.. మార్చి 16న విడుదల కాబోతున్న ఈచిత్రంతో ఈ ట్రాయాలజీకి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్టుగా దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. లేటెస్ట్‌ పార్ట్‌ని శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆశీస్సులతో సాయిక ృష్ణ ఫిల్మ్స్‌ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వరక్రియేషన్స్‌ బ్యానర్స్‌పై శ్రీనివాస మీసాల ,రజని తాళ్లూరి, సాయికృష్ణ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు..