మార్చి నుండి రవితేజ రాబిన్‌ హుడ్‌

Ravi Teja
గతేడాది బెంగాల్‌ టైగర్‌తో హిట్‌ అందుకున్న మాస్‌ మహారాజ్‌ రవితేజ తన తదుపరి సినిమా దిల్‌ రాజుతో చేయాలి. కానీ ఆ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన తదుపరిగా కమిట్‌ అయిన యంగ్‌ డైరెక్టర్‌ చక్రి సినిమా చేయడానికి సన్నా హాలు చేసుకుంటున్నాడు. ఫ్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇటీవలే రాబిన్‌ హుడ్‌ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసామని తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఫిబ్రవరిలో అన్ని ఫ్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ని ఫిలిష్‌ చేసి మార్చ్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటోంది. రంజిత్‌ మూవీస్‌ బ్యానర్‌పై దామోదర్‌ ప్రసాద్‌ ఈ సినిమాని నిర్మించనున్నాడు. హాలీవుడ్‌లో బాగా ఫేమస్‌ అయిన ఈ రాబింన్‌ హుడ్‌ పాత్ర తరహాలోనే రవితేజ పాత్ర కూడా  ఉంటుం దని సమాచారం. అలాగే ఈ సినిమాలో హాట్‌ బ్యూటీ అమీ జాక్సన్‌ని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అమీ కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి. అందుకే అమీ జాక్సన్‌ తన కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ చేయగలమా లేదా అనే సందిగ్దంలో ఉంది. అన్నీ అనుకు న్నట్టే జరిగితే అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది.