మార్కెట్‌కు కొత్తగా 3 ఐపిఒలు

IPO
IPO

మార్కెట్‌కు కొత్తగా 3 ఐపిఒలు

ముంబయి, జూలై 31: మార్కెట్లకువస్తున్న ఐపిఒలలో కొత్త కంపెనీ లు ఎస్‌బిఐ లైఫ్‌, మాట్రిమోనిడాట్‌కామ్‌, షాల్బీ హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి. వీటితో కలిపితే ఇప్పటివరకూ ఈ ఏడాది సెబీ అనుమతిచ్చిన ఐపిఒ కంపెనీల సంఖ్య 21కి చేరింది. భారత్‌ మాట్రిమోని బ్రాండ్‌పై సంబంధాలు కుదిర్చే వ్యాపారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న మాట్రిమోని డాట్‌కామ్‌, మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌చైన్‌ ఆపరేటర్‌ షాల్బీహాస్పిటల్స్‌ మేనెలలోనే ఐపిఒ కోసం సెబీకి దరఖాస్తుచేసుకుని అనుమతులు పొందాయి.సెబీ వెబ్‌సైట్‌ను చూస్తే మాట్రిమోని డాట్‌కామ్‌ఈనెల 13వ తేదీ, 14వ తేదీ షాల్బీ హాస్పిటల్స్‌కు అనుమతులు లభించాయి. ఎస్‌బిఐ అనుబంధంగా ఉన్న ఎస్‌బిఐ లైఫ్‌ బీమా ఇప్పటికే ఐపిఒకోసం సెబీకి దరఖాస్తుచేసుకుని అనుమతిని సాధించింది. ఐపిఒద్వారా ఎస్‌బిఐ లైఫ్‌ రూ.8500 నుంచి 9000కోట్ల నిధు లు సమీకరించాలని నిర్ణయం. ఐసిఐసిఐప్రులైఫ్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లలో జాబితా అవుతున్న రెండో కంపెనీగా ఎస్‌బిఐ లైఫ్‌ నిలిచింది.

ఎస్‌బిఐ లైఫ్‌ ముఖవిలువ రూ.10గా ఉంటే మొత్తం 12కోట్ల ఈక్విటీషేర్లను విక్రయించేందుకు ఎస్‌బిఐ, పిఎన్‌పి పరి భాస్‌ కార్డిఫ్‌లు సిద్ధం అవుతున్నాయి. వీటిలో ఎస్‌బిఐ ఎనిమిది కోట్ల షేర్లను విక్రయిస్తుండగా బిఎన్‌పి నాలుగుకోట్ల షేర్లను విక్ర యించింది. అర్హత కల ఉద్యోగులకు 20 లక్షలషేర్లను పదిశాతం రాయితీతో విక్రయించనున్నారు. అలాగే ఎస్‌బిఐ వాటాదారులకు 1.2కోట్ల వాటాలను కొనుగోలుచేసేందుకు రిజర్వుచేసింది. జెఎం ఫైనాన్షియల్‌ ఇస్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌కేపిటల్‌, బిఎన్‌పిపరిభాస్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌మార్కెట్స్‌ ఇండియా, డాయిష్‌ ఈక్విటీస్‌ ఇండియా, ఐసిఐసిఐసెక్యూరిటీస్‌ కోటక్‌ మహీంద్ర కేపి టల్‌, ఎస్‌బిఐకేపిటల్‌ మార్కెట్లు లీడ్‌మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ఈ ఆర్థికసంవత్సరంలో ఎస్‌బిఐలైఫ్‌విలువ రూ.16,537.9 కోట్లుగా కొంత కొత్త వ్యాపారం రూ. 10,368 కోట్లుగా నమోద యింది.

2001లో భారతీయస్టేట్‌ బ్యాంకు, బిఎన్‌పి పరిభాస్‌ కార్డిఫ్‌లు ఉమ్మడిగా ఎస్‌బిఐ లైఫ్‌ను ఏర్పాటుచేసాయి. గతఏడాది చివరివరకూ కంపెనీ డెత్‌క్లయిమ్స్‌ 92.33శాతం నుంచి 97.98 శాతానికి పెంచింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బిఐ లైఫ్‌ నికరలాభం రూ.955 కోట్లు ఉండగా అంతకుముందు ఏడాది ఆర్జించిన రూ.861కోట్లతో పోలిస్తే 11శాతం ఎక్కువ. ఇక మాట్రి మోని డాట్‌కామ్‌పరంగాచూస్తే ఇష్యూవిలువ రూ.130కోట్లు, ఆఫర్‌ ఫర్‌సేల్‌ రూటులో 37,67,254షేర్లను విక్రయిం చేందుకు ఐపిఒ కు వస్తోంది. మాట్రిమోని డాట్‌కామ్‌ ఈ ఇష్యూ ద్వారా రూ.350కోట్లను సమీకరించేందుకు సన్నా హాలు చేసుకుంటున్నది.

అడ్వర్టయిజింగ్‌, బిజినెస్‌ మ్రోషన్‌ చెన్నైలో కార్యాల నిర్మాణంకోసం స్థలం కొనుగోలు, అప్పుల చెల్లింపులు, ఇతర ఖర్చులకు ఈనిధులను వినియోగించనున్నది. 2015లోనే ఐపిఒకోసం సెబీకి దరఖాస్తుచేసుకున్నా అప్పట్లో కంపెనీకి అనుమతులు రాలేదు. షాల్బీ హాస్పి టల్స్‌పరంగా చూస్తేరూ.580 కోట్ల విలువైన షేర్ల విక్రయంజరుగుతున్నది. ప్రమోటర్‌ విక్రమ్‌షా విక్రయించే రూ.10లక్షల షేర్లను విక్రయించేందు కు షాల్బీ హాస్పిటల్స్‌ ఐపిఒకు వస్తోంది. ఐపిఒ ద్వారా సేకరించిన నిధులను అప్పులు తిరిగిచెల్లిం చడం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆసుపత్రుల్లో యంత్ర సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తుంది. ఇంటీరియర్స్‌, ఇన్‌ఫ్రా కోసం కూడా కొన్ని నిధులు కేటాయిస్తుండగా సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కొంతమొత్తం కేటాయిస్తారు. ఎస్‌బిఐ లైఫ్‌, మాట్రిమోని డాట్‌కామ్‌, షాల్బీ హాస్పిటల్‌షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ రెండు ఎక్ఛేంజిల్లో జాబితా కానున్నాయి.