మార్కెట్లలో హల్‌చల్‌చేస్తున్న హువేయి ‘హానర్‌8లైట్‌

honorr
honorr

మార్కెట్లలో హల్‌చల్‌చేస్తున్న హువేయి ‘హానర్‌8లైట్‌

హైదరాబాద్‌, మే 28: స్మార్ట్‌ఫోన్లలో యాపిల్‌, శాంసంగ్‌ ఇతర చైనా కంపెనీలకు గట్టిపోటీ ఇస్తున్న మరో అగ్రగామి చైనా కంపెనీ హువేయి నుంచి హానర్‌8 లైట్‌ ఫోన్‌ను విడుదలచేసింది. హానర్‌8 సిరీస్‌లో వస్తున్న ఈఫోన్‌ ధర రూ.17,899గా పలికింది. అత్యాధునిక ఫీచర్లతోపాటు అత్యద్భుతమైన పని తీరుతో రూ.20వేల లోపు స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీఇస్తుందని అంచనా. మొత్తం గ్లాస్‌ డిజైన్‌తో డబుల్‌ సైడెడ్‌ 2.5డి కర్వ్‌ గ్లాస్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఫోన్‌ దిగువన స్పీకర్లను ఏర్పాటుచేసారు. మంచి క్వాలిటీ ఆడియో వస్తుందని కంపెనీ చెపుతోంది. 7.6ఎంఎం మందంతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా వస్తోంది. 3000ఎంఎహెచ్‌ బ్యాటరీ 93గంటలపాటు పనిచేస్తుంది.

15 గంటల పాటు వీడియోను చూసుకోవచ్చు. హానర్‌8లైట్‌ హువైయి 655 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ 4జిబిరామ్‌, 64జిబి అంతర్గత మెమరీ ఎస్‌డికార్డు సాయంతో 128 జిబివరకూ పొడిగించుకోవచ్చు. వన్‌బటన్‌ నేవిగేషన్‌, అన్ని భద్రతా ఫీచర్లతో హానర్‌లైట్‌ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌. హైబ్రిడ్‌ ష్లిమ్‌స్లాట్లు ఉంటాయి వైఫై, బ్లటూత్‌, యుఎస్‌బి ఒటిజి 3జి, 4జి వోల్టే టెక్నాలజీల్లో కూడా పనిచేస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాక్సిలరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌తోపాటు 12ఎంపి వెనుక కెమేరా/8ఎంపి ముందుకెమేరాలు స్పష్టమైన చిత్రాలను అంది స్తున్నాయి. వైడ్‌యాంగిల్‌ లెన్స్‌తో ఉన్న కెమేరా అత్యధిక నాణ్యత కలిగిన సెల్ఫీలను ఇస్తుందని అంచనా. ఆటోఫోకస్‌, వన్‌టచ్‌ ఫోకస్‌, చిరునవ్వు గుర్తింపు, ముఖ గుర్తింపు, స్వీయ టైమర్‌, జియోట్యాగింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. హైడైనమిక్‌ రేంజ్‌ పనోరమా సీన్స్‌ అన్నింటినీ తీసుకునే వెసులుబాటు ఉంది.

అంతేకాకుండా కంపెనీ సొంతంగా డిజైన్‌చేసిన ఇంటర్‌ఫేస్‌ ఇఎంయుఐ5 విప్లవాత్మక ఫీచర్లతో పనిచేస్తుంది. మార్కెట్లలో హల్‌చల్‌చేస్తున్న హానర్‌ 8లైట్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.20వేల లోపు ఉన్న అన్ని బ్రాండెడ్‌ బహుళజాతి కంపెనీలకు సైతం గట్టిపోటీ ఇస్తుందని టెలికాం రంగనిపుణులు చెపుతున్నారు. ఇప్పటికే పలు టెలికాం సంస్థలు ఈ కేటగిరీ ఫోన్లను తమతో టైఅప్‌చేసుకుని అదనపు డేటా ఆఫర్లుసైతం అందిస్తున్నాయి. హువేయి హానర్‌8 ఖచ్చితంగా మార్కెట్‌లో విదేశీ బ్రాండ్లకు సైతం గట్టిపోటీ ఇస్తుందని అంచనా. ఇక చైనా నుంచి వస్తున్న లెనోవో, ఒప్పో, జియోని వంటి కంపెనీలు ఇప్పటికే రూ.20వేలోపు ఫోన్లు అందిస్తున్నాయి. తాజాగా వచ్చిన హానర్‌8లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ వీటికి గట్టిపోటీ అవుతుందని అంచనా.