మార్కెట్లలో ‘బుల్‌ రన్‌!

Sensex
Sensex

మార్కెట్లలో ‘బుల్‌ రన్‌!

ముంబయి, మే 5: ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణులు దేశీయ ఫండ్స్‌ భారీ పెట్టుబడుల కారణంగా ఆదినుంచి లాభాలతోనే మొదలైన మార్కెట్లు కొంతమేర ఊగిసలాడి చివరకు కొత్త గరిష్టస్థాయిని నమోదుచేసాయి. ఫెడ్‌ రిజర్వు యధాతథ పాలసీ అమలు, మొండిబకాయిల పరిష్కారానికి ఆర్‌బిఐకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌గ్రీన్‌సిగ్నల్‌ కొంతదోహదం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లలో పూర్తి హవా సాగింది ట్రేడింగ్‌ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 231పాయింట్లు ఎగిసి 30,126 పాయింట్లవద్ద స్థిరపడితేనిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 9360 పాయింట్లవద్ద స్థిరపడింది. చారిత్రక గరిష్ట స్థాయిగా చెపుతున్నారు.

ఎన్‌ఎస్‌ఇలో బ్యాంక్‌నిఫ్టీ 22,720వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. సెన్సెక్స్‌ సైతం ఇంట్రాడేలో 30,170 పాయింట్లకు జంప్‌చేసింది. అలాగే నాలుగోత్రైమాసిక ఫలితాల్లో ఐసిఐసిఐబ్యాంకు గరిష్ఠస్థాయి లాభాలు ప్రకటించింది. తొమ్మిదిశాతం షేర్లు దూసుకెళ్లాయి. బ్యాంక్‌నిఫ్టీ, ఇటు నిఫ్టీకి సైతం ఐసిఐసిఐ బూస్ట్‌ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ కౌంటర్లకు సైతం భారీ డిమాండ్‌ ఏర్పడింది. పిఎస్‌యుబ్యాంకు సూచి 3.4శాతం,ప్రైవేటుబ్యాంక్‌సూచి రెండుశాతంచొప్పున జంప్‌చేశాయి. మిగిలిన రంగాల్లో ఎఫ్‌ఎంసిజి ఒకటిశాతం పురోగమిస్తే మెటల్‌, రియాల్టీ, ఆటోరంగాలు దాదాపు ఒకటిశాతం స్థాయిలో నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, స్టేట్‌బ్యాంకు, అదాని పోర్టులు, యాక్సిస్‌బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఏసియన్‌పెయింట్స్‌, ఎసిసి 1.5 నుంచి 4శాతం మధ్య ఎగిసాయి. అయితే మరోవైపు హిందాల్కో, హెచ్‌సిఎల్‌టెక్‌, టాటా, మోటార్స్‌, జీ, ఒఎన్‌జిసి, ఐఒసి, ఎంఅండ్‌ఎం, కోటక్‌బ్యాంకు, సిప్లా, ఇండస్‌ ఇండ్‌ 1నుంచి 2.4శాతం మధ్య నీరసించాయి.

దేశీయస్టాక్స్‌లో అమ్మకాలే కట్టుబడి ఉనన విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం నగదు విభాగంలో 518 కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. గడచిన రెండువారాల్లో ఎఫ్‌పిఐలు నగదు విభాగంలో సుమారు 6700 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. మరోవపు పెట్టుబడులు కుమ్మరిస్తున్న దేశీయ ఫండ్స్‌ సుమారు ఎనిమిదివేల కోట్లను పెట్టుబడిపెట్టిన సంగతి తెలిసిందే. ఇక మార్కెట్లపరంగాచూస్తే చిన్న షేర్లకు సైతం డిమాండ్‌ పెరిగింది. దీనితో బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచి 0.5శాతం బలపడగా స్మాల్‌క్యాప్‌ సూచి 0.4శాతం పెరిగింది.

ట్రేడ్‌ అయిన మొత్తం షేర్లలో 1452 లాభపడగా 1407 నష్టపోయా యి. మిడ్‌క్యాప్స్‌లో యూనియన్‌ బ్యాం కు, ఎక్సైడ్‌, కెనరాబ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకు, ఎబినువో, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, క్రాంప్టన్‌, ఇండియన్‌ బ్యాం కు, ఇమామి, ఐడిబిఐ హ్యావెల్స్‌ బయో కాన్‌ జిల్లెట్‌, ఒరాకిల్‌ టాటాకెమి కల్స్‌, గ్లాక్సో తదితర కంపెనీలు 2నుంచి 6.5 శాతంమధ్యముగిసాయి. స్మాల్‌క్యాప్స్‌లో టిఐఎ్‌, చంల్‌, సుదర్శన్‌ కెమ్‌, ఓరియంట్‌ వినీర్‌, మాస్టెక్‌, ఐఒబి, టిటికె, ఉద§్‌ుసింమెట్‌ విఇగార్డ్‌, మధుకాన్‌, వీమార్ట్‌, కోరమాండల్‌ పంజాబ్‌కెమ్‌ సంస్థలు ఏడు నుంచి 12శాతంమధ్య దూసుకెళ్లాయి. ఇక మిడ్‌క్యాప్స్‌లో ఆర్‌ కామ్‌, గ్లెన్‌మార్క్‌, ఎంఆర్‌ఎప్‌, కన్సా§్‌ు,ఫేజ్‌, భారత్‌ ఫోర్జ్‌, మారికో తదితర సంస్థలు 2-3శాతం మధ్య క్షీణించాయి. స్మాల్‌క్యాప్స్‌లో ఎన్‌డిటివి, బిల్ట్‌, టైమ్‌ టెక్నో, ఆర్కోటెక్‌, న్యూట్రాప్లస్‌, ఇంటలెక్ట్‌, కెఎస్‌ఎ, శిల్పి, గుజరాత్‌ బోరో, ఆర్‌పిజిలైఫ్‌, హాత్‌వే, ఎంటిఎన్‌ఎల్‌, తదితర సంస్థలు పతనం అయ్యాయి.