మార్కెట్లలో తప్పని అనిశ్చితి

SENSEX DOWN1
sensex

మార్కెట్లలో తప్పని అనిశ్చితి

 

ముంబై, నవంబరు 20: దేశీయ స్టాక్‌మార్కెట్లలో ఈ వారంలో కూడా ఒత్తిళ్లు తప్పవన్న అంచనాలున్నా యి. గడచిన వారంలో మార్కెట్లు పలుసార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చివరికి వారం మొత్తంగా 2.5శాతం క్షీణించాయి.ఇక వచ్చేవారం లో గురువారం 24వతేదీతో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ నంబరు సిరీస్‌ ముగస్తుంది. ప్రధాన సూచీ లైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశంఉందని ఇన్వెస్టర్ల అంచనా. అంతేకాకుండా మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీలు ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. వీటితో పాటే విదేశీ మార్కెట్లధోరణులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వైఖరి, డాలరుతో రూపాయి మారకం విలువలు, ముడిచమురుధరలు వంటివి మార్కెట్లకు కీలకం అవుతాయి. అంతేకాకుండా జరుగుతున్న శీతాకాలపార్లమెంటు సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు ఓకన్నేస్తారు. ఇక ఎల్‌అండ్‌టి మంగళ వారం తన రెండోత్రైమాసికఫలితాలు ప్రకటిస్తుంది.
వీటితోపాటే అదిత్యబిర్లాఫ్యాషన్‌, బాటా ఇండియా, టైడ్‌ వాటర్‌ ఆయిల్‌ కూడా తమతమ ఫలితాలు వెల్లడించనున్నాయి. పెద్దనోట్లు రద్దుతో పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్నా యి. ఎలాంటి చర్చలు లేకుండానే వాయిదా పడ్డా యి. వచ్చేనెల 16వ తేదీతో ముగస్తున్న ఈ సమా వేశాలకు ప్రభుత్వం 19 రాజ్యాంగ బిల్లులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. వీటిలోకీలకమైన జిఎస్‌టి బిల్లుసైతం ఉంది. వచ్చేఏడాది ఏప్రిల్‌ నుంచి జిఎస్‌టి అమలుచేసేలక్ష్యంతో ప్రభుత్వం ఉందన్న సంగతితెలిసిందే. ఇక ఈవారంలో అమెరికా మరి కొన్ని ఆర్థిక గణాంకాలు విడుదలవుతాయి. పాత, కొత్త గృహాల అమ్మకాల వివరాలు, నిరుద్యోగ సమా చారం, వినియోగధరల వృద్ధి వంటి గణాంకాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిమూడో త్రైమాసిక జర్మనీ జిడిపి గణాంకాలు గురువారం వెల్లడవుతాయి. ఆ మరుసటిరోజే బ్రిటన్‌ తన మూడో త్రైమాసిక జిడిపి వివరాలు వెల్లడిస్తుంది. ఈ అంశాలు కూడా మార్కెట్ల ధోరణులను నిర్ణయి స్తాయి. గడచిన వారంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్ట ర్లు భారీ స్థాయిలో విక్రయాలు జరిపారు. 2354 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన ఎఫ్‌ఐఐలు బుధ వారం కూడా 1957 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్‌లో మాత్రం 2344 కోట్లు పెట్టుబ డులు పెట్టారు. అలాగే గురువారం మరోసారి 984 కోట్లు స్టాక్స్‌ విక్రయించి లాభాలు వెనక్కి తీసుకున్నారు. దేశీయంగా ఫండ్స్‌ సంస్థలు 1144 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఎఫ్‌ఐఐల పెట్టుబ డులు అమ్మకాలు కూడా దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయనడంలో సందేహంలేదు. వారం మొత్తంగా ఇంకా అనిశ్చితి వీడదని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు విశ్లేషిస్తున్నాయి.