మార్కెట్లపై ఆర్ధిక, బ్యాంకింగ్‌ ఒత్తిళ్లు

BSE
BSE

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
ముంబయి: బిఎస్‌ఇ సెన్సెక్స్‌,ఎన్‌ఎస్‌ఇ నిప్టీ రెండూ కూడా అంతకుముందు లాభాలనుంచి తిరోగమించాయి. మధ్యాహ్నం తర్వాతనుంచి ప్రతికూలంగా మారాయి. వరుసగా మూడోరోజు సైతం సూచీలన్నీ దిగజారాయి. ఆర్ధికరంగ కంపెనీల్లో భారీ నస్టాలే ఇందుకు కారణం అయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి వంటి సంస్థలు భారీ ప్రభావంచూపించాయి. అసెట్‌మెనేజ్‌మెంట్‌ కంపెనీలు హెచ్‌డిఎఫ్‌సి ఎఎంసి, రిలయన్స్‌ నిప్పన్‌ ఎఎంసి వంటివి 12శాతం దిగజారాయి. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ మూచువల్‌ఫండ్‌ స్కీంలలో మొత్తం వ్యయనిష్పత్తిని తగ్గించడమే ఇందుకుకారణం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 1143.73 కోట్లు విక్రయిస్తే దేశీయ ఇన్వెస్టర్లు 264.66 కోట్ల విలువైన షేర్లను కొనుగోలుచేసారు. అంతర్జాతీయ మార్కెట్లపరంగా యూరోపియన్‌ మార్కెట్లు కొంత ముందుకు కదిలాయి. ఆసియా మార్కెట్లు, అమెరికా చైనా వాణిజ్యయుద్ధాలు మరింత తీవ్రతరం కావడం ముడిచమురుదరలు పెరగడం, సౌదీఅరేబియా బ్రెంట్‌ చమురుధరలపై ఆశాభావంతో కనిపించడంవంటి అంశాలు కేవలం యూరోప్‌, ఆసియా మార్కెట్లకు కలిసొచ్చాయి. ముడిచమురుధరలు బ్యారెల్‌కు 80 డాలర్లుగా నడిచాయి. హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్‌ కంపెనీలు నష్టాలు ఎక్కువపెరిగాయి. హెచ్‌డిఎఫ్‌సి 1.35శాతం నష్టపోతే హెచ్డఇఎఫ్‌సి బ్యాంకు 1.58శాతం దిగజారింది. అలాగే సంస్థ అసెట్‌ మెనేజ్‌మెంట్‌ స్టాక్‌ 8శాతానికిపైగా దిగజారింది. కోల్‌ ఇండియా, ఒఎన్‌జిసి, టాటాస్టీల్‌, గెయిల్‌ వంటివి టాప్‌ లాభాల్లో నడిస్తే ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, మారుతిసుజుకి,ఎస్‌బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్‌ వంటివి భారీ నష్టాలు చవిచూసాయి. ఇక బంగారంధరలు పదిగ్రాములు 50రూపాయలుపెరిగి బుధవారం కొంత లాభాలతో ఉన్నాయి. స్థానిక జ్యూయెలర్లు, అంతర్జాతీయ మార్కెట్‌ధోరణులు కలిసి రావడమే ఇందుకుకీలకం. ఢిల్లీలో 99.9శాతం, 99.5శాతం స్వఛ్ఛత కలిగిన బంగారంధరలు 50చొప్పున పెరిగి పదిగ్రాములు రూ.31,660, 31,510గా పెరిగాయి. వీటితోపోలిస్తే వెండిదరలుసైతం కిలో ఒక్కింటికి రూ.300 పెరిగి 38వేలుగా నడిచింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులు కొనుగోళ్లుపెంచడమే ఇందుకుకీలకం. ఇక చక్కెర కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసాయి. ప్రభుత్వం చక్కెర ఎగుమతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడమే ఇందుకు కీలకం. బలరాంపూర్‌చిన్నిమిల్స్‌ 5.3శాతం పెఇరగింది. దాల్మియా భారత్‌సుగర్‌ ఇండస్ట్రీస్‌ 9.5శాతం, ధమ్‌పూర్‌సుగర్‌మిల్స్‌ ఏడుశాతం, ఉత్తమ్‌సుగర్‌మిల్స్‌ 7.1శాతం, రాజ్‌శ్రీసుగర్స్‌ కెమికల్స్‌ 9.7శాతం చొప్పున పెరిగాయి. ముడిచమురుదరలుపెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువలు మరింతగా క్షీణించడం వంటి వాటితో ఎక్కువశాతం నగదు మార్కెట్లలో నిధులు బైటికి తరలిపోతున్నాయి. రూపాయి క్షీణతను మరింత కట్టడిచేసేందుకు ఆర్‌బిఐ జోక్యం మరింతగా అవసరం అవుతోంది. టాటాస్టీల్‌ లాభాల్లో ముందుకుదూసుకుపోతే డాలరుతో రూపాయిమారకం విలువలు మాత్రం 72.5350గా నడిచింది. ఆల్‌టైమ్‌ కనిష్టస్థాయి 72.99నుంచికొంతమేర రూపాయి పటిష్టం అవుతూ వస్తోంది. ఇక నిఫ్టీ కూడా 0.37శాతం పెరిగింది. 11,320.30 పాయింట్లవద్దస్థిరపడింది.టాటాస్టీలక్ష 2.8శాతంపెరిగిగే జిందాల్‌ స్టీల్‌ పవర్‌ 3.1శాతంపెరిగింది. ఐదు మిలియన్‌ టన్నుల చక్కెరను ఎగుమతిచేసేందుకుప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో ఈకంపెనీలు లాభాల్లోనే ముగిసాయి.