మార్కెట్లకు చీకటివారం

BSE
BSE

మార్కెట్లకు చీకటివారం

ముంబై, డిసెంబరు 3: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఈ వారం చీకటివారంగా మిగిలింది. వారం ప్రారంభం తొలిరోజు స్వల్ప లాభాలు ఆర్జించినప్పటికీ ఆ తర్వాత నాలుగు రోజులు ప్రధాన సూచీలు నష్టాలే చవిచూశాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాలు రెండు సూచీలు భారీగా పతనమయ్యాయి. గురు వారం సెన్సెక్స్‌ 450పాయింట్ల దాకా నష్టపోగ, శుక్రవారం మరో 316పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం అదేస్థాయిలో 104.75పాయింట్లు నష్ట పోయింది.

ఫలితంగా రెండుసూచీలు కూడా వారం మొత్తం మీద 2.5శాతానికి పైగా నష్టపోయాయి. 2013ఆగస్టు తర్వాత ప్రధాన సూచీలు ఒక వారంలో ఇంతగా నష్టపోవడం ఇదే మొదటి సారి. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లు త్రైమాసికం జిడిపి గణాంకాలు వెల్లడించినప్పటికీ ఆర్థికలోటు పెరిగిపోవడంపై మార్కెట్లలో నెలకొన్న భయాలు తొలగిపోలేదు. ఫలితంగా మదుపరులు కొనుగోలు కన్నా అమ్మకాలవైపే మొగ్గుచూపారు. దాదాపు అన్నిరంగాలకు చెందినషేర్లు నష్టపోవడం గమ నార్హం.

ఈనేపథ్యంలో వచ్చేవారం కూడా మార్కెట్ల లో ఆటుపోట్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తయారీరంగంలో మెరు గుదల కనిపిస్తున్నట్లు జిడిపి గణాంకాలు వెల్లడిం చినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాలకే మొగ్గు చూపించారని బిఎన్‌పి పరిబాస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ కార్తీక్‌రాజ్‌ లక్ష్మణన్‌ అభి ప్రాయపడ్డారు.

శుక్రవారం ప్రారంభంలో ఒక దశలో 33,300పాయింట్లను దాటినప్పటికీ సెన్సెక్స్‌ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని, చివరి వరకు అదే తీరును కొనసాగించింది. నిప్టీలో సైతం ఇదే ధోరణి కొనసాగించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు రిస్క్‌తీసుకోవ డానికి ఇష్టపడకపోవచ్చని, అందువల్ల వచ్చే వారం కూడా మార్కెట్లలో ఇదే దోరణి కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.