మార్కెట్లకు ఆర్‌బిఐ షాక్‌

B7
bse

మార్కెట్లకు ఆర్‌బిఐ షాక్‌

ముంబై, డిసెంబరు 7: రిజర్వుబ్యాంకు తన ద్వైమాసిక సమీక్షలో రెపో రేట్లను స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా దిగజారాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 156 పాయింట్లు దిగ జారి 26,237 పాయింట్లవద్ద స్థిరపడితేనిఫ్టా 50 సూచి 51 పాయిం ట్లు దిగువన 8102 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు కూడా 0.2 నుంచి 0.5శాతం దిగజారా యి. ఆర్‌బిఐ నిర్ణయం అనూహ్యమని అలాగే జిడిపి వృద్ధిరేటును కూడా 7.6శాతం నుంచి 7.1శాతానికి కుదించడం పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందనే చెప్పాలి. మార్కెట్లు ఇప్పటికే వడ్డీరేట్లు 25బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందని ఆశించాయి. అయితే ఆర్‌బిఐ యధాతథంగా కొనసాగించడంతో మార్కెట్లు ఒక్కసారిగా నీర సించాయి.

అంతర్జాతీయంగా ఒపెక్‌దేశాల ఉత్పత్తి కుదింపు నిర్ణయంతో రానున్న రోజుల్లో ముడి చమురుధరలు పెరుగుతాయని అందువల్ల ఇంధన, ఆహారద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుందన్న లక్ష్యంతోనే ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిఎన్‌పి పరిభాస్‌ రీసెర్చి హెడ్‌ వినోద్‌నాయర్‌ అన్నారు. అయితే ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్లుకనుక పెంచితే డాలర్‌ మరింతపటిష్టం అవుతుందని, తద్వారా రూపాయి మారకం విలువలు మరిం త తగ్గుతాయని ఆయన అన్నారు. ఆర్‌బిఐ డాలర్‌ మారకం విలువలను 67.87రూపాయలుగా నిర్ణయించింది. యూరోమార కం విలువలు 72.75రూపాయలుగా నిర్ణయించింది.

మార్కెట్‌ స్థితిగతులకు అనుగుణంగానే ఆర్‌బిఐ రేట్లను మార్చలేదని, బాండ్‌ మార్కెట్లు ఇందుకు సంబంధించి ప్రతికూలంగానే స్పందించాయని బిఎన్‌పి ఫిక్సెడ్‌ ఇన్‌కమ్‌ అధిపతి కురియకోస్‌ వెల్లడించారు. 50 బేసిస్‌ పాయింట్లు వడ్డీరేట్లలో కోత ఉంటుందని ప్రకటించారు. ఆర్‌బిఐ ఇప్పటివరకూ చూస్తే పెద్దనోట్లరద్దుకు సంబం ధించి మరింత మదింపుచేయాల్సిన అవ సరం ఉందని, ఈ స్వల్పకాలిక సమస్యలు తప్పవని ఆర్‌బిఐ ప్రకటించ డాన్ని ఆయన గుర్తు చేశారు.

అంతేకాకుండా అమెరికా బాండ్లరాబడులుకొంతెరిగాయి. ఫెడ్‌ఫండ్స్‌ రేట్‌ డిసెంబరులోపెరుగుతుందన్న సంకేతాలు ఎక్కు వయ్యాయి. దీనివల్ల భారత్‌రూపాయి మరింత బలహీనపడు తుందని అంచనా. ఆసియామార్కెట్లలో బుధవారం ఇన్వెస్టర్లు స్వల్ప కాలిక పొజిష్టన్లతో కొంత వృద్ధిని నమోదుచేవౄరు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు పాలసీ సమీక్ష నిర్ణ యాలు, ఇటలీ రిఫరెండమ్‌ వంటివి కీలకం అయ్యా యి. ఎఫ్‌టిఎస్‌ఇ, ఫ్రాన్స్‌సిఎసి, జర్మనీడాక్స్‌ వంటివి ఒకటిశాతం పెరిగాయి. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బయటిప్రాంతంలో 0.25 శాతంగా ఉన్నాయి.
జపాన్‌ నిక్కీ 0.7శాతం గరిష్టంగా పెరిగింది. ఆస్ట్రేలియా షేర్లు 0.91శాతం పెరిగాయి. మూడోత్రైమాసికంలో కూడా ఆర్ధికవ్యవస్థ స్వల్పంగా క్షీణించింది. దీనివల్లవచ్చే కొద్ది నెలల్లోనే సెంట్రల్‌ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనా లున్నాయి. మోర్గాన్‌ స్టాన్లీ ప్రపంచ స్టాక్‌మార్కెట్లసూచీ గడచిన రెండునెలలతో పోలిస్తే గరిష్టస్థాయికి చేరింది. నవంబరు నెలలో కనిష్టస్థాయి నుంచి 3.4శాతం ఎగబాకింది. ఇక దేశీ యంగా వడ్డీరేట్ల ఆధారిత రంగాలు ఎక్కువ ప్రబావితం అయ్యాయి. బ్యాంకింగ్‌, రియల్‌ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ రం గాలు ఇంట్రాడేలో లాభాలున్నా పాలసీ నిర్ణయం వెలు వడినతర్వాత దిగజారాయి.

బ్యాంకునిఫ్టీ తన ఇంట్రాడే లాభాలను కుదించుకుంది. ఒకటిశాతందిగువన ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసిఐసిఐబ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ఇండియాలు దిగజారాయి. సన్‌ఫార్మా ఆరుశాతం దిగజారి 664 కు చేరింది. ఎన్‌ఎస్‌ఇలో హలోల్‌ కర్మాగారం ఎఫ్‌డిఎతనిఖీకి వెళ్లిం దని ప్రకటించడమే కీలకం. ఇక ఎంపికచేసిన ప్రభుత్వరంగ కంపెనీలు 14శాతం పెరిగాయి. ఎంఎంటిసి, నేషనల్‌ అల్యూమినియం కంపెనీ, ఐటిఐ, బాల్మర్‌ లారీ అండ్‌కో, ఆయిల్‌ అండ్‌ నేచురలగ్యాస్‌ కార్పొ రషన్‌, తన52వారాల గరిష్టస్థాయిని నమోదుచేశాయి. బిఎస్‌ఇ ఇంట్రా డే ట్రేడింగ్‌లో వీటిని మరింతగా లాభాలు పొందినట్లు అంచనా.