మార్కెటింగ్‌ శాఖలో పోస్టుల భర్తీకి సర్కారు అనుమతి

career
career

హైదరాబాద్‌: తెలంగాణలో మార్కెటింగ్‌ శాఖలో 200ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్‌ కార్యదర్శి, 80 అసిస్టెంట్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌, 13 గ్రేడర్‌ , 9 బిడ్‌ క్లర్క్‌, 60 జూనియర్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.