మాయావతితో పవన్‌ భేటీ?

MAYAWATI, PAWAN
MAYAWATI, PAWAN

లక్నో: ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జనసేన అధినేత పవన్‌, జనసేన ప్రతినిధులు, విద్యావేత్తలు, ఉస్మానియా విద్యార్థులు కూడా పర్యటిస్తున్నారు. ఐతే బిఎస్పీ నేత మాయావతితో భేటీ అయ్యేందుకు పవన్‌ కళ్యాణ్‌ యుపి వెళ్లినట్లు తెలస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి ప్రధాని అభ్యర్ధిగా మాయావతి పేరు వినిపిస్తుండటంతో భవిష్యత్‌ రాజకీయాలపై జాతీయ నాయకులతో చర్చించాలని పవన్‌ నిర్ణయించినట్లు సమాచారం. లక్నోలో పలు పార్టీల ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో పవన్‌ పాల్గొననున్నారు.