మామ్ చిత్రంలో శ్రీదేవికి ఉత్త‌మ‌న‌టి అవార్డు

SRIDEVI
SRIDEVI

న్యూఢిల్లీః దివంగత అందాల నటి శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ‘మామ్’ చిత్రంలో ఆమె నటనకుగాను ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ విషయాన్ని రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇండియాలోని అద్భుత నటుల్లో శ్రీదేవి ఒకరని, ఆమెకు ఈ అవార్డు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ‘మామ్’ చిత్రానికి తాను కూడా పని చేశానని, ఆ అవకాశం తనకు లభించడం, ఇప్పుడు శ్రీదేవికి ఈ అవార్డు రావడంతో గర్వపడుతున్నానని తెలిపారు. కాగా, ‘మామ్’ శ్రీదేవి ఆఖరి చిత్రమన్న సంగతి తెలిసిందే.