‘ మాన‌వ‌త్వ‌మే’ ఆస్థిగా జూక‌ర్‌బ‌ర్గ్‌

jukerburg
jukerburg

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్క్‌ దాదాపు రూ.77 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య అభివృద్ధి నిమిత్తం విరాళంగా అందించేందుకు సిద్ధమైనారు. ఇందుకోసం ఆయన తన కంపెనీలో 35-75 మిలియన్‌ వాటాలను విక్రయించాలని ప్రతిపాదించారు. ఈ వాటాల మొత్తం ప్రస్తుతం ఉన్న ప్రకారం సుమారు రూ.77 వేల కోట్ల పైచిలుకే. రాగల 18 నెలల్లో కేవలం వితరణ కార్యక్రమాలకే ఖర్చు పెట్టనున్నారు. ఫేస్‌బుక్‌ వ్యాపారం బాగా ఉంది. గత ఏడాదిన్నరలో పరిస్థితి చక్కగా ఉంది. అందుకే, ఛారిటీపై మరో ఇరవై ఏళ్ల దాకా మనస్ఫూర్తిగా ఖర్చుపెట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.