మానసిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి…

Happy lady
Happy lady

మానసిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి…

మానసిక సామర్థ్యం గల వ్యక్తి ప్రతిపనిలోను సక్రమత్వాన్ని కనబరుస్తాడు. పనులు చేస్తున్నప్పుడు తన గడియారం వైపు తప్పక ఒక కన్నువేసి ఉంచుతాడు. తాను ఇతరులకు ఇచ్చిన సమయాన్ని తప్పక పాటిస్తాడు. తన పనులకు సంబంధించిన ఒక ప్రణాళికను తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం పనులు చేస్తుంటాడు. సంసిద్ధత, క్రమబద్ధత అన్నవి మనిషి మానసిక సామర్థ్యాన్ని సూచిస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో అసమర్ధుడు ఆలస్యం చేస్తాడు. అయినాకూడా ఆ నిర్ణయాలు హృదయ పూర్వకంగా తీసుకున్న నిర్ణయాలుగా ఉండక అసంపూర్తిగా ఉంటాయి. ఆ నిర్ణయంలో నిర్ణయశక్తి, దృఢత్వం ఉండవ్ఞ. ఇతరులతో కలసి జీవించటం, ముందుకు వెళ్ళేందుకు అవసరం. విజయసహకారంతో ముడివేయబడింది. మీరు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

కాలాన్ని వ్యర్థం చేయకుండా అనవసరమైన వివరాలను సమీకరించడానికి మీశక్తిని ధారపోయకుండా జాగ్రత్త పడండి. మనలో మనం పురోగతిని కనుగొన లేక పోయినప్పుడు దానికోసం బయట వెతకడం వృధానే. ఆర్జించిన సంపదకన్నా, విజ్ఞానంకన్నా, సదుపాయాలు కన్నా మనుషులు ఎక్కువ విలువైనవారు. మీలో వ్ఞన్న ఉత్తమ గుణాన్ని ఇతరులకుయివ్వండి. అప్పుడే ఉత్తమమైనది. మీకు తప్పకుండా తిరిగి ఇవ్వబడుతుంది. నీవ్ఞ మంచివాడని భావించుకున్నప్పుడు. నీవ్ఞ శక్తి కలిగిన వ్యక్తిగా తెలుసుకుంటావ్ఞ. నీ సామర్థ్యంపైన ఎక్కువ విశ్వాసంతో ఉంటావ్ఞ. ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోగలననే నమ్మకంతో ఉంటావ్ఞ. నీకు వీలైనంత మెరుగైన పద్ధతిలో వీటిని పరిష్కరించుకోగలననే దృఢవిశ్వాసంతో ఉంటావ్ఞ. తనను తాను పొగడుకునే వ్యక్తి ఎప్పటికైనా తలవంచుకుంటాడు. కాని వినయంగా వ్ఞండే వాడి పొగడ్తలను పొందుతాడు.

మీరు చెెప్పేదాన్ని తప్పక ఆచరించ లేకని నీవ్ఞ చేసేదంతా చెప్పుకోవడం తెలివి తక్కువ కాగలదు. ఇతరులతో పాలు పంచుకున్నప్పుడు సంతోషం రెండింతలుగా అవ్ఞతుంది. ఇది మీకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. తెలివి తేటలు గల వ్యక్తికి ఏ పనిని చేయాలో తెలుస్తుంది. కానీ సామర్థ్యమున్న వ్యక్తి ఆ పనిని ఎలా చేయాలో తెలుసుకొని వ్ఞంటాడు. వెర్రి సాహవాసంతో ఏ పనిని చేయకుండా ఉండడం అన్నదే తెలివి ప్రత్యేకత జయానికి వెయ్యమంది తల్లిదండ్రులు ఓటమి ఒక అనాధ. మంచిగా ఆలోచించడం వివేకంతో కూడినది. మంచి ప్రణాళికలను తయారుచేసుకోవడం మరింత మంచిది. మంచిగా చేయడం ఇంకా చాలా గొప్పది ఇతరులకు సంభవించిన దుర్ఘాటనల నుండి హెచ్చరికలు తెలుసుకోవడం మంచిది. నీచుడు సంపదను చూసి మురిసిపోతాడు. ఘనుడు కీర్తిని చూసి ఆనందిస్తాడు. మీతప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు నేర్పుతుంది.

ఇరవై సంవత్సరాల వయస్సులో సంకల్పం రాజ్యం చేస్తుంది. ముప్ఫై సంవత్సరాల వయసులో వాక్చాతుర్యం మనిషిని పాలిస్తుంది. నలభైసంవత్సరాల వయసులో తీర్పు శాసిస్తుంది. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలంటే కోరికను మీలో పెంచుకొండి. మన మనస్సును చేస్తున్న పనులపై కేంద్రీకృతం చేయగల సామర్థాయాన్ని కలిగి ఉండడం అన్నది ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరులతో పోటీపడడం అన్న భావనను మానండి. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అలాగే స్వీకరించడం, మీ సామర్థ్యాలను ఉపయోగించి ఉత్తమంగా పని చేయడంలోనే మీ సంతోషం దాగి వ్ఞంది. మాట్లాడవలసి వస్తే కష్టంగా మాట్లాడండి. నోటి నుండి మాట బయట పడే ముందు ఆ మాటను మలచుకున్న తరువాతే మాట్లాడండి.

సలహాలు అందరికి ఇవ్వండి. కానీ హామీ మాత్రం ఎవరికీ ఇవ్వకండి. కాని వాటికి ఏదో పరిష్కారం వ్ఞందని ఎప్పుడూ నమ్మడమే ఆశావాదం మీలోని ఉత్సాహాన్ని నిద్రపోకనివ్వండి. ఒక లక్ష్యం అంటూ మీ ముందుంటే దాన్ని చేరడానికి మీరు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరింత శ్రద్ధతో మీరు ఈ పనని చేయగలరు. మనిషి చేస్తున్న పనిలో అతడు కనబరిచే తీవ్రమైన శ్రద్ధ అతడు కనబరచే తీవ్రమైన శ్రద్ధ అతన్ని విజయం సాధించేలా చేస్తుంది. మూడు తరగతులకు చెందిన వ్యక్తులు ఉంటారు.

మొదటి తరగతి వ్యక్తులు తమ అనుభవాల ద్వారా నేర్చుకుం టారు. వారు వివేకవంతులు. ఇతరుల అనుభవాల ద్వారా నేర్చుకునేవారు రెండవ తరగతి వారు వీరు ఆనందంగా వ్ఞంటారు. మూడవ తరగతిక చెందిన వ్యక్తులు అటు తన అనుబంధం ద్వారా గాని ఇతరుల అనుబంధాన్ని చూసి నేర్చుకోరు. వీరు మూర్ఖులు. అతి స్వల్ప ప్రాధాన్యం కల విషయాల ప్రాముఖ్యతను గ్రహించాలి. అది ప్రత్యేకత కలది కానీ లేదా ఒక నిర్థిష్టమైన విధి అయినప్పుటికీ పూర్తిచేయగలు గుతాము. అల్ప నీటి బిందువ్ఞలు అత్యల్ప ఇసుకురేణువ్ఞలు, బ్రహ్మాండమైన సముద్రాన్ని మరియు రమ్యమైనభూమిని నిర్మిస్తాయి. మంచికైనా చెడుకైనా అత్యల్ప విషయాలను అనుసరించే రావాలి. నిజమైన ఆనందాన్ని అనుభవించేవారు. ఉన్నదానితోనే సదా తృప్తి పొందేవారు. మన జీవితం తరువాత కూడా నిలిచేలాటి దాన్ని సాధించడమే జీవితపరమార్ధం.