మానవ జీవితం దానఫలం

LORD KRISHNA
LORD KRISHNA

మానవ జీవితం దానఫలం

దానం చేసే గుణము సద్గుణము ఇది మానవ జాతికే దక్కిన సుగుణం. ఒక వస్తువు మీద లేక పదార్థము మీద తనకున్న హక్కును వదులుకొని ఇతరులకు ఆ హక్కులు కల్పించడం ఒకరు ఇచ్చినదానిని మరొకరు స్వీకరిస్తే దానమవుతోందని తుజ్ఞ వల్కుడు చెప్పాడు. దానం వలన చిత్తశుద్ధితో పాటు మనిషికి మనిషిగా గుర్తించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, మనుష్యలకే కాదు సర్వజీవులు ఒక్కటేనని సమభావ సమానత్వం ప్రదర్శించడం దానం అవుతుంది.

గత జన్మలో మనం దానధర్మాలు చేయకపోవడం వల్ల ఈ జన్మలో దారిద్య్రం ప్రాప్తిస్తుంది. దారిద్య్రం వల్ల బుద్ది చెడి పాపకార్యాలు చేయుట జరుగుతున్నది. ఇలా పాపాలు చేయుట వలన మళ్లీ మరో జన్మలో కూడా ధరిద్రులుగా పుడతారు. కనుక దరిద్రపు జీవితం రాకుండా ఉండాలంటే మనకు తోచినది మన దగ్గర ఉన్నదాంట్లోనే ఎంతోకొంత దానం చేయడం ప్రతి మానవుడు తన ధర్మంగా భావించాలి. మానవలందరూ హాయిగా జీవితాన్ని గడిపేందుకు ఏర్పాటు చేసిన ఒక పవిత్ర కార్యం, దానం. ఈ దానం కొందరికి భుక్తి ప్రదాయకమయితే మరికొందరికి ముక్తి ప్రదాయకం, దానం ఇచ్చే వారి ఆయుష్సు పెరుగుతుంది. కానీ పుచ్చుకొనే వారి ఆయుష్షు మాత్రం క్షీణించదు. దానం విలువను గురించి అగ్ని పురాణంలో అగ్ని దేవుడు వశిష్టుడికి వివరించాడు. దానం వివిధ రూపంగా చేయబడును. శక్తిలేని యోగ్యునికి తగిన చోటు. తగిన సమయంలో దానం చేయుట కర్తవ్యమని, నిశ్చయముతో దానం చేయాలి. పుణ్యం కోసమని దానం చేస్తే అది ప్రత్యుపకారము, ఫలము ఆపేక్షించి అని ఇహముగానే చేసే దానం రాజసం. రజోగుణ స్వభావులు దానం చేస్తే సంస్థగాని, దేవాలయం గాని, తను చేసే దానం వలన తనకు కీర్తి రావాలని ఆశిస్తాడు. ఆ విధమైన దానం దానమేకాదని శాస్త్ర వచనం. ప్రదేశం కాలంతో పని లేకుండా ఆ పాత్రులకు ఆమర్యాదపూర్వకంగా ఇచ్చు దానం తామసం అన్నారు. రాజస తామస సాత్విక దానాలలో సాత్విక దానం ఉత్తమైనదిగా గీతలో శ్రీకృష్ణుని సందేశం. దానం చేసేటప్పుడు సత్కార భావంతో మర్యాదపూర్వకంగా ఇవ్వాలి.

పాప ఫలితంగా దరిద్రాడైన వాడు, ధీనుడు, మూఢుడు అపాత్రులైన వారికి దాన ధర్మాలు చేయడం దాతకు అన్ని విధాలా శ్రేయస్కరం. దానం చేయడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్న దానికి సవరణలు కూడా ఉన్నాయి. యోగ్యునికి దానం చేయడం వలన దాత యొక్క సంపదలు అభివృద్ధి చెందుతాయి. దానివలన దాత అనేక పుణ్యకార్యాలు చేయవచ్చును. దానం చేయుటచే పుణ్యం లభిస్తుంది. పుణ్య కార్యాలు చేయుట వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. దాని వలన తిరిగి ఉత్తమైన జన్మ లభించి సర్వసౌభాగ్యాలు అనుభవించవచ్చును. కృతయుగంనందు తపస్సు, త్రేతాయుగంనంందు బ్రహ్మజ్ఞానం, ద్వాపర యుగుమందు యజ్ఞయాగాలు, ఈ కలియుగంలో దానం ఉత్కలష్ట ధర్మాలని, నాలుగు యుగ ధర్మాలుగా మనుస్మృతి చెపుంది. దానం తపస్సు ఆచరించదగినవేగాని విడువదగినవికావని శ్రీకృష్ణుడు అర్జుననకు ఉపదేశించాడు. ఈ లోకంలో విధి విధానంగా సత్పాత్రునికీయబడినదానం అక్షయ వటవృక్ష సదృశ్యమైనదని ఆది శంకరాచార్యులు వారి ఉవాచ. నిస్వార్థ దానంతో భగవదర్పణ బుద్ధితో దానం చేసిన భగవత్రాప్తి సిద్ధించును.

– ఉలాపు బాలకేశవులు