మానవీయ కోణంలో పాలన

Kcr
TS CM Kcr in Assembly

మానవీయ కోణంలో పాలన

 
హైదరాబాద్‌: దేశంలో మరెక్కడా లేనివిధంగా మానవీయకోణం తెలంగాణప్రభుత్వం పరిపాలనసాగిస్తోందని సిఎం కెసిఆర్‌ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు.. రాష్ట్రంలో ఒంటరిగా నివసించే మహిళలలకు నెలకు రూ.వెయ్యి పింఛన్‌గా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చప్పారు.. దీనికారణ:గా రాష్ట్ర ఖజానాకు భారం పడుతున్నా లెక్కచేయకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి సభ ముక్త కంఠంతో మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

నగరం చుట్టూ విస్తరంగా పరిశ్రమలు

హైదరాబాద్‌ చుట్టూతా పరిశ్రమలు విస్తరించాయని కెసిఆర్‌ తెలిపారు.. ప్రశ్నోత్తరాల సమయంలో కిషన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.. పరిశ్రమల వల్ల కాలుస్యం పెరగటం, హుస్సేన్‌సాగర్‌ వటి లేక్‌ దుర్వాసన భరితంగా తయారైందని కెసిఆర్‌ అన్నారు. తెలంగాణకు సముద్రం లేని కొరత తీర్చే ద సదస్సు కాలుష్య కారకంగా మారటం బాధాకరమన్నారు.. హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్‌ విషయంలో త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం సమానమైన అభివృద్ధి అయ్యేలా ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారు.