మానవత్వాన్ని బలిగొంటున్న రాజకీయాలు

HERRASMENT-1
HERRASMENT

మానవత్వాన్ని బలిగొంటున్న రాజకీయాలు

దేశంలో మహిళల పట్ల, బాలికల పట్ల లైంగిక వేధిం పులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్ని వర్గాలప్రజలు, ప్రభుత్వం ఆందోళన చెందుతున్నా రు. సమాజంలో ఇతరులపట్ల ఉండాల్సిన కనీస గౌరవ మర్యా దలు, సభ్యతా, సంస్కారాలు లేకుండా పోతున్నాయని, ఒకరకమై న మానసిక అసమతౌల్యత ఏర్పడడం వల్లనే ప్రతి చిన్నదానికి ఇత రులపై విరుచుకుపడడం, హింసను ప్రేరేపించడం జరుగుతుందని అందరు భావిస్తున్నారు.

మహిళలపై, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను ముక్తకంఠంతో ఖండించాల్సిన రాజకీయ నాయ కులు మానవత్వాన్ని మరిచి తమ రాజకీయ అవసరాలకు అనుగు ణంగా వాస్తవాలను బలిస్తున్నారు. రాజకీయ కారణాలే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా ఉండే పలుకారణాలు దేశంలో అసహనా నికి, మహిళలపై దాడులకు కారణం కావచ్చు. గత దశాబ్దకాలంలో భారతదేశ సమాజం మతం, కులం, ప్రాంతం, భాష అనే సంకు చిత వాదాల మధ్య విడిపోయి, ఇతరులపై విద్వేష భావనలను ప్రచారం చేస్తున్నాయి. మతం కులం అనేవి మనదేశంలో వేల ఏళ్లుగా ఉన్నాయి. ఎన్నో కులాలు, మతాలూ కొత్తగా మనదేశంలో పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తున్నాయి.ఇవన్నీ కొంత మంది తమ వ్యక్తి గత మరికొంతమంది తమ రాజకీయ, సమూహ అవసరాల కోసం సమాజంలో సృష్టిస్తున్న విభేదాలు ఈ ఆకృత్యాలకు మూలం. వీటికొక సిద్ధాంత భూమిక అంటూ లేకపోవడంతో విచ్చలవిడిగా, వికృత రూపంలో అసాంఘిక శక్తులను ప్రేరేపిస్తున్నాయి. దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో మహిళలపై ముఖ్యంగా చిన్న పిల్లలపై లైంగికదాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయనే వార్తలు మనవ తావాదులను కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూలోని కథువా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావా సంఘటనల విషయంలో రాజకీయ పార్టీల వైఖరిని అన్ని వర్గాల ప్రజలు తప్పుపడుతున్నారు.

ఈ నేప థ్యంలో కేంద్ర సర్కారు దిద్దుబాటు చర్యగా చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉద్దేశించిన పోస్కో చట్టాన్ని మరింతగా బలపరచడానికి, నిందితులను మరింత కఠినంగా శిక్షించడానికి ప్రత్యేక సవరణలను ఆర్డినెన్స్‌ను తేవడం మరింత వివాదాస్పదం అవతుంది.నిందితులను శిక్షించడానికిఇప్పటికే మనదేశంలో అనేక చట్టాలున్నాయి.నిందితులను మరింత భయపెట్టడానికో,లేక ఇలాం టి నేరాలుచేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పుడానికో అన్నట్లు ఈ సవరణలో మరణశిక్షను చేర్చారు. ప్రపంచంలో మరణ శిక్షనే ఉండవద్దని మానవతావాదులు పోరాడుతున్న సమయంలో బాల లపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడ్డ వారికి మరణ శిక్ష విధించాలనే సవరణ వల్ల ఈ నేర ప్రవృత్తిని ఎంతవరకు తగ్గించగలమనే ప్రశ్న ఉత్పన్నమవ్ఞతుంది. ఎందుకంటే స్త్రీలపై, బాలికలపై జరిగిన నేరాలలో దాదాపు 80 శాతం నేరాలు నిరూ పించబడటం లేదు. నేరగాళ్లకు ఎలాంటి శిక్షలు పడటం లేదు. అదీకాకుండా అత్యాచార కేసులలో సంవత్సరాల తరబడి విచారణ కొనసాగడం కూడా మన న్యాయవ్యవస్థపై బాధితులకు నమ్మకం కొరవడుతుంది.

అత్యాచార కేసులను సంవత్సరంలోగా విచారించి కేసులను పూర్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అది ఏ ఒక్క కేసు విషయంలో కూడా అమలైన దాఖలాలు లేవ్ఞ. విచారణ దర్యాప్తు పేర నేరాభియోగ పత్రం దాఖలు చేయకుండా, ఏళ్ల తరబడి పోలీసులు కాలయాపన చేస్తున్నారు. అలాగే కోర్టులలో వివిధ కారణాల వలన వాయిదాల మీద వాయిదాలతో బాధితుల ను మానసికంగా కృంగదీస్తున్నారు.ఆ తరువాతకూడా నేరం నిరూ పితం కాలేదని నిందితులను విడిచిపెట్టడం వలన సమాజంలో న్యాయస్థానాలపై, పోలీసు వ్యవస్థపై గౌరవం పోతుంది. నేరగా ళ్లకు ఈ చర్యలు మరింత ధైర్యాన్ని ఇస్తున్నాయి. శిక్షలలో కఠినతే కాకుండా త్వరిత గతిన కేసుల పరిష్కారం జరిగితే బాధితులకు న్యాయం చేసినట్లవ్ఞతుందనే విషయం అందరు అంగీకరించేదే. అయినా దశాబ్దాల తరబడి విచారణ కొనసాగడం సహజ న్యాయ సూత్రాలకే విరుద్ధం. న్యాయం ఆలస్యం కావడమంటే న్యాయాన్ని నిరాకరించడమే అన్న సూక్తికి నేటి సమాజంలో విలువనే లేకుండా పోయింది. వివిధ సాంఘిక సంస్థల, ప్రజాసంఘాల ఒత్తిడిమేరకు 2012లో ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ ఫ్రోం సెక్సువల్‌ అబ్యుసెస్‌ -చట్టం చేసిన ఎనిమిది నెలలలోనే ఢిల్లీలో నిర్భయ అత్యాచారం జరిగిం ది. అంటే చట్టాలంటే అత్యాచారం చేయాలనుకొనే దుర్మార్గులకు ఎంత భయం ఉందో అర్థం అవ్ఞతుంది.

ఈ పోస్కో చట్టంలో 18 సంవత్సరాల పిల్లలపై జరిపే ఎలాంటి అఘాయిత్య చర్య అయినా శిక్షార్హమైనదిగా నిర్వచించారు. డిసెంబర్‌ 2012లో జరిగిన నిర్భయఅత్యాచార ఘటనతో దేశం లో వెల్లువెత్తిన నిరసనలకు భయపడిన ప్రభుత్వం ప్రజల డిమాం డ్‌కు తలొగ్గి ఆఘమేఘాలపై జస్టిస్‌ జేఎస్‌ వర్మ అధ్యక్షతన, విశ్రాంత న్యాయమూర్తి లీలాసేథ్‌, సుప్రీంకోర్టు న్యాయవాది గోపా ల్‌ సుబ్రహ్మణ్యన్‌సభ్యులుగా వేసిన కమిటీ దాదాపు ఎనిమిదివేల విజ్ఞపులు,సూచనలను పరిశీలించి తనకిచ్చిన గడువ్ఞలోగానే అంటే 23 రోజులలోనే నివేదికను సమర్పించింది. నిర్భయ చట్టంగా పిలువబడే దీనిలో భారత శిక్షాస్మృతిలోని 354 సి,డి,సెక్షన్‌లోని శిక్షలను భారీగా పెంచారు. అలాగే 375 సెక్షన్‌లోని ‘మానభంగం అనే పదానికి వివరణ ఇస్తూ సవరణ చేసారు. అలాగే కొత్తగా 376ఎ అనే సెక్షన్‌చేర్చి అందులో విధించే శిక్షలను చెప్పారు. ఈ సవరణలకు చట్టబద్ధతను కల్పిస్తూ పార్లమెంట్‌ చేసిన సవరణలకు రాష్ట్రపతి ఏప్రిల్‌రెండు 2013న ఆమోదముద్రవేసారు. ఈ చట్టాల లో అత్యాచారానికి గురైన బాలిక, మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేర కు వెంటనే ప్రాథమిక సమాచార పత్రాన్ని నమోదు చేసుకొని విచారణ చేపట్టాలని చెప్పారు. కాని ఈ చట్టాలను మనసా, వాచా మనదేశంలోని ఏ ప్రాంతంలోని పోలీసులు పాటిస్తున్నట్లు లేదు. దాదాపు 70 శాతం అత్యాచారాలు సమాచానికి తెలుపడం లేదు. తెలిసిన వాటిలో 15 శాతం కూడా చట్టపరిధిలోకి రావడం లేదు. వచ్చిన వాట్లో ఒకటి రెండిటిల్లో కూడా సత్వర న్యాయం దొరకడం లేదు. నిర్భయకేసులో కూడా మైనర్‌అనే పేర నిందితులు తప్పిం చుకోవడం దురదృష్టకరమైన విషయం.బాధితులకు న్యాయం దొర కకపోవడం, సమాజంలో అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకనే బాధితులు లోలోన కుంగిపోతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలో పాలకులకు, పోలీసులకు చిత్తశుద్ధి లేకుంటే బాధితులకు న్యాయం జరగదనే విషయం తేటతెల్లమవ్ఞతుంది. ప్రభుత్వం నిర్వహించే ఛైల్డ్‌ లైన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా దేశం లోని దాదాపు 55శాతం పిల్లలు లైంగిక అత్యాచారాలకు గురవ్ఞతు న్నారని ప్రకటిస్తుంది. వీటిని అరికట్టడానికి ఎన్నో సూచనలు చేసిం ది.అయినాజరిగే అన్యాయాలు జరుగుతున్నాయి.రాజకీయ పార్టీలు ఏవైనా తమ రాజకీయ అవసరాల కోసం నిందితులను రక్షిస్తాయనే సత్యాన్ని ఉన్నావ్‌, కథువ సంఘటనలు రుజువు చేసాయి.

సి.హెచ్‌.ప్రభాకర్‌రావు
(రచయిత: సీనియర్‌ జర్నలిస్టు)