మానవతా రమణీయ శిఖరం

NV RAMANAIAH
NV RAMANAIAH

మానవతా రమణీయ శిఖరం రమణయ్య

నిగర్వి, నిరాడంబరులు, స్నేహశీలి, నైతిక సంపన్నులు, సేవాతత్పరులైన యన్‌.వి.రమణయ్య మానవతా శిఖరం. ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన మనస్సు, ఉన్నతమైన సంస్కారం, మధురమైన మాటలు ఆయన సొంతం. పెట్టని ఆభరణాలు. నందనవనం వెంకట రమణయ్య తల్లి శ్రీలక్ష్మ మ్మ. తండ్రి నరసింహవయ్య.

1935 జులై 10న ప్రకాశం జిల్లా పాత శింగరాయకొండ గ్రామంలో రమణయ్య జన్మించారు. ఆయన పుట్టిన 12వ రోజుకే తల్లి శ్రీ లక్ష్మమ్మ మరణించారు. అందువల్ల ప్రకాశంజిల్లాలోని బింగినపల్లిలోని అమ్మమ్మ మహాలక్ష్మమ్మ దగ్గర పెరిగారు. ప్రాథమికవిద్య బింగినపల్లిలో,ఉన్నత విద్య ఒంగోలులోని మున్సిపల్‌ ఉన్న త పాఠశాలలో, ఇంటర్మీడియేట్‌ నెల్లూరులోని వి.ఆర్‌ కళాశాలలో చదివారు.

డిగ్రీ విజయనగరం మహారాజా కళాశాలలో, పి.జి మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌ యూనివర్శిటీలో చది వారు. 1953-55 ఇంటర్‌ చదివే రోజులలోనే అభ్యుదయ భావా లుకలిగిన విద్యార్థిగా అనేక ఉద్యమాలలో పాల్గొనేవారు. డెమోక్ర టిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (డిఎస్‌యు అప్పటిలో సోషలిస్టు పార్టీకి అనుబంధంగా ఉండేది. వి.ఆర్‌ కాలేజీ (నెల్లూరు)సెక్రటరిగా కూడా సేవలందించారు.

1954 లో నెల్లూరులోని బీడీి కార్మికుల కూలి పెంచాలని (రూ.1.50పై నుంచి రూ.2.00పై)డాక్టర్‌ పుచ్చల పల్లి రామచంద్రారెడ్డి (పుచ్చల పల్లి సుందరయ్య సోదరులు) స్ఫూర్తి తో రమణయ్య, మధురాం తకంమాధవరావ్ఞ, ఇస్మాయిల్‌ (నెల్లూరు పత్రిక ఎడిటర్‌), పరచూ రు రామకోటయ్య కమ్యూనిస్టు పార్టీ జిల్లా సెక్రటరీ తదితరులతో కలిసి ఉద్యమించారు. రమణయ్యతో సహా అందరిని అరెస్టు చేసి నెల్లూరు జిల్లా రాపూరు సబ్‌ జైలులో 15 రోజులు రిమాండ్‌ ఉంచారు.

విజయనగరంలోని మహారాజా కళా శాలలో బి.ఎ చదివే రోజులలో సోషలిస్టు బాట్టం శ్రీరామమూర్తి అప్పటి విజయనగరం యం. ఎల్‌.ఎ కె.యస్‌. తిలక్‌, యం.పి శాస్త్రి కార్మిక నాయకుడు తదితరు లతో ఎక్కువ పరిచయాలు ఏర్పడినందున సోషలిస్టు పార్టీ తరపున జనరల్‌ ఎలక్షన్లలో రమణ య్య శ్రమించారు.

డిగ్రీ, పిజి చదివే మధ్యవిరామకాలంలో 1961 సంవత్సరంలో విజయవాడలో ‘చేతన మాసపత్రికను ప్రారంభించి ఎడిటర్‌, ప్రింటర్‌, పబ్లిషర్‌గా యన్‌.వి.రమణయ్య బాధ్యతలు చేపట్టి ఎ.వి.కె చైతన్య ఆల్‌ ఇండియారైల్వే మజ్దూర్‌ యూని యన్‌ సెక్రటరి సహాయ సహ కారాలతో నడిపారు.చేతన రాజ కీయ, సామాజిక అంశాలపై ప్రజా చైతన్యానికి పాడుపడేది. చైతన్య ‘చేతన అంశాలు ఎక్కు వ చూస్తూ నడిపేవారు.

తరు వాత కాలంలో టి.వెంకట్రామ య్య నడిపారు. పి.జి చేసిన తరువాత 1963లో కావలి కళాశాల జవహర్‌ భారతిలో ట్యూటర్‌గా చేరారు. విశ్వోదయ వ్యవస్థాపకులు దొడ్ల రామచంద్రారెడ్డి అభ్యు దయ భావాలు కలిగిన వారు, గొప్ప స్వాప్నికుడు, మంచి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చిన మానవతా సంపన్నులు. రమణయ్య గారికి కూడా ఉద్యోగం ఇచ్చారు. విశ్వోదయ ఆశయాలను సుసంపన్నం చేయడానికి కూడా తన వంతుకృషి చేశారు. జవహర్‌భారతి కళాశాలలో అధ్యాపకు డుగా డిగ్రీకళాశాల కరస్పాండెంట్‌గా సుదీర్ఘకాలం14సంవత్సరాల పాటు సేవలంధిం చారు.

నాటి ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసినప్పుడు దానిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ సోషలిస్టు ఫోరం తరపున కావలిలో రమణయ్య సామాన్యుల చేత, పేదల చేత, చిరు వ్యాపారుల చేత బ్యాంకులలో పొదుపు ఖాతాలు తెరిపించి, వారికి బ్యాంకు రుణాలు ఇప్పించారు. పెట్టీలోన్స్‌ ఇంటిం టికి తిరిగి కూరగాయలు అమ్మేవారికి చేపలు అమ్మేవారికి, చిరు వ్యాపారాలకు రుణాలు ఇప్పించారు. అంతకు ముందు సంపన్నులు మాత్రమే బ్యాంకు లావాదేవీలు జరిపేవారు. రిక్షా కార్మికులకు సొంత రిక్షా కల నెరవేరే లాగా తాను హామీ వ్ఞండి ఎంతో మందికి రిక్షా రుణాలు ఇప్పించారు.

కొంతమంది సరిగా కట్టలేకపోతే, తాను కష్టాలలో వ్ఞం డికూడా తన జీతంనుండి నెలనెలా బ్యాంకుకు కట్టిన నిజాయి తీపరుడు. విశ్వోదయ జవహర్‌భారతి కళాశాల వ్యవస్థాప కులు డి.ఆర్‌ ఆశీస్సులు రమణయ్యగారికి ఉండేవి. 1971లో వర్షాభావం వలన కావలి మున్సిపాలిటీిలో నీటికొరత ఏర్పడింది. అప్పటి మున్సిపల్‌ ఛైర్మన్‌ సహాయసహకారాలతో రైల్వే వ్యాగన్ల ద్వారా నీరు వచ్చేటట్టు చేసి, కాలేజి విద్యార్థుల చేత నీటి ట్యాంకుల ద్వారా పట్టణ ప్రజలందరికి సక్రమంగా నీరు అందేటట్లు చేయడం లో రమణయ్య కృషి విస్మరించలేనిది.

1976 సంవత్సరంలో కావలి లో త్యాగరాజు ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడంలో ప్రముఖపాత్ర వహించారు.దివిసీమ ఉప్పెన సందర్భం లో ఒడిశాతు ఫాన్‌ సందర్భంలో, గుజరాత్‌ భూకంపం సందర్భాల్లో రమణయ్య బాధితులకు అందించిన సేవలు మరువలేనివి.

అదే విధంగా కావలిలో నవవికాస్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసిన సేవలు మరవలేనివి. అటు సామాజిక సేవ, సామాజిక స్పృహ సామాజిక చైతన్యం కలిగించే గ్రంథాలు ప్రచురించడంలో ప్రముఖ పాత్ర వహించిన మార్గదర్శి రమణయ్య.

సొసైటీ ఫర్‌ సోషల్‌చేంజ్‌ ఆధ్వర్యంలో ఉన్నవ రచనలు కొన్ని సంకలనాలు అక్షర డి.ఆర్‌ అభినందన 1994 పేజీలు, శంకరన్‌ 693 పేజీలు, మధుమురళి బాలమురళీ కృష్ణ అభినందన సంచిక 254 పేజీలు, పరిశోధన సామల సదాశివ సృతి సంచిక 1214 పేజీలు, రథచక్రాలు 413 పేజీలు, బతుకు పుస్తకం 216 పేజీలు, ఏకాంత సేవ 118 పేజీలు తదితర గ్రంథాలు అంకితభావంతో చిత్తశుద్ధితో ప్రచురించారు. రమణయ్య ఏ పనిచేసినా, ఏ సేవ చేసినా, ఏ గ్రంథాలు ప్రచురించినా ఆయన చేసిన మంచి పని మాత్రమే కనిపిస్తుంది. రమణయ్య కనిపించరు.

వ్యక్తిగత ప్రచారానికి, పేరుప్రఖ్యాతులకు ప్రాధాన్యత ఇవ్వని మంచి మనస్పున్న మనిషి రమణయ్యమాష్టరు. 09.02.1963న ఆయన మాలతీదేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి రాధిక, రేణుక, సురేఖ అనే ముగ్గురు కుమార్తెలు. సురేఖ చిన్న కూతురు చనిపోయింది. హైదరాబాద్‌లో పెద్దకూతురు రాధిక ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా 16.01.2018 స్వర్గస్తులయ్యారు. నేటి యువత రమణయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకోవడం ఎంతైనా అవసరం.

– కూనం తాతిరెడ్డి

(రచయిత: సొసైటీ ఫర్‌ సోషల్‌ చేంజ్‌ కార్యనిర్వాకులు)