మాతృభాష పరిరక్షణే మన కర్తవ్యం

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Telugua language-1
Telugua language-1

మాతృభాష పరిరక్షణే మన కర్తవ్యం

మనది తెలుగుజాతి. రెండువేల అయిదు వందల సంవ త్సరాల ఘనమైన చరిత్ర గల మహో న్నత జాతి. తెలుగు ప్రజలు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరా టం సాగించి సాధించారు. అయితే ఇంతటి చరిత్ర కలిగిన తెలు గు భాషకు ఇటీవలికాలంలో దురవస్థ దాపురించింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆఖ రులో తెలుగుకుపట్టం కడుతూ మూడురోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి భాషాభిమానులను చైతన్య పర్చింది.

సభల వరకు అట్టహాసంగా జరిగినా ఆచరణలో ఎంతవరకు సత్ఫలితాలు చేకూరాయో ఎవరికి వారు ఆత్మశోధన చేసుకోక తప్పదు.ఆంగ్లభాషపై ఉన్న అపరిమితవ్యామోహం తెలు గుమూలుగులను పీల్చి పిప్పిచేస్తోంది.తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ కోసం మళ్లీ ఉద్యమించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘దేశభాషలందు తెలుగులెస్సఅని 15వ శతాబ్దంలోనే చాటిచెప్పిన శ్రీకృష్ణదేవ రాయల ఆంధ్ర భాషా సారస్వత సేవలను ఈ సంద ర్భంగా గుర్తుతెచ్చుకోకతప్పదు. సంస్కృత భాషతోపాటు ద్రావిడ భాషల్లో ప్రావీణ్యం కలిగిన రాయలు తెలుగులో ఆ ముక్తమాల్య దవంటి ప్రబంధ రచన చేయడం ఆయనకు తెలుగుపై కల మక్కు వను చాటుతుంది.ప్రజల భాషలోనే పరిపాలనచేయాలని, ప్రజల భాషలోనే గ్రంధాలను రచించి ప్రజలను సమున్నత విజ్ఞానపారం గతులుగా చైతన్యపర్చాలనినిరూపించిన శ్రీకృష్ణదేవరాయల నుంచి నేటి మనప్రభుత్వాలు నేర్చుకోవలసినది

ఎంతయినా ఉంది. దక్షిణ హిందూ దేశంలో రాయలకాలంలో తెలుగు రాష్ట్ర భాష గా ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. తెలుగుభాషకు పట్టం కట్టిన చక్రవర్తి కృష్ణరాయలే. రాయలు తన పాలనా కాలంలో అనేక శాసనాలు తయారు చేయించాడు. తెలుగుదేశంలో తెలుగున, కన్నడ దేశంలో తెలుగు, కన్నడ భాషల్లో తిరుపతి క్షేత్రంలో తమి ళం, కర్ణాటకం, ఆంధ్ర ఈ మూడు భాషల్లో శాసనాలు చేయిం చాడు. ప్రాంతీయ భాషల్లో శాసనాలు చేయిస్తేనే ప్రజలకు బాగా తెలుస్తుందని రాయల అభిప్రాయం. రాయలను ఆదర్శంగా తీసు కుని నాయక రాజులు తమిళం ప్రాంతీయ భాషగా కలిగిన దక్షిణ దేశంలో తెలుగుభాషనే రాష్ట్ర భాషగా ప్రాధాన్యం కల్పించారు. తమిళంతోపాటు తెలుగు లోనూ శాసనాలు చేయించారు. ఆనాటి కృషి ఫలితంగా దక్షిణ దేశంలో ఆంధ్రభాష సుస్థిరతను సాధించ గలిగింది.

తంజావూరి నాయకుల్లో చివరి వాడగు విజయరాఘవ నాయకుడు నాగపట్టణంరేవ్ఞలో డచ్చివారికి తెలుగుభాషలో వెండి రేకుపై చెక్కిన శాసనాన్ని సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది. ఇండోనేషియాలో ఇప్పటికీ ఈ శాసనం భద్రంగా ఉంది. తెలుగు సాహిత్య వికాసంలో శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని స్వర్ణయుగ మంటారు. దీనికి కారణం ఆకాలంలో తెలుగుభాషా సాహిత్యాల కు తెలుగు మహాకవ్ఞలకు అపారమైన గౌరవం ఉండడమే. తెలు గు ప్రబంధాలను ఆనాటి ప్రభువ్ఞలు శిరోధార్యంగా భావించా రు. తెలుగు పలుకులోని తియ్యదనాన్ని ఆస్వాదించారు. రాయ ల మాతృభాష తమిళభాష అని కొందరు, కాదని ఇంకొందరు తర్జనభర్జన పడుతున్నా ఆంధ్ర భోజుడన్న బిరుదు మాత్రంరాయ లకే దక్కింది.ఆంధ్రుల అభిమానానికి తగ్గట్టుగా ఆంధ్ర లోని ఒక ప్రాంతానికి రాయలసీమ అని పేరు పెట్టుకోవడం గమ నార్హం. శ్రీకృష్ణ దేవరాయల తరువాత తెలుగు భాషా వికాసానికి పాటుప డిన పాలకులు బహుతక్కువ. అనేక మంది పాలకుల ప్రభావం వల్ల వారి భాషా పదాలు కూడా తెలుగులో వచ్చి చేరాయి.

మహ మ్మదీయుల పాలనలో పార్సీ, ఉర్దూ పదాలు వచ్చి చేరగా, ఆంగ్లే యుల పాలనలో ఆంగ్ల పదాలు చేరాయి. ఎన్ని భాష ల పదాలు వచ్చి చేరినా తెలుగు భాష స్వరూపాల ఉనికికి అంతగా నష్టంగా ఏర్పడలేదు.మరింతగా విస్తరించింది. ఆంగ్లేయులు వెళ్లిపో యినా ఆంగ్లభాష వ్యామోహం రానురాను పెరిగి తెలుగు మౌలిక స్వరూ పాన్నే భ్రష్టుపట్టిస్తోంది.పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయు లపై చిన్నచూపు, ఇంగ్లీషు మాస్టరంటే అభిమానం కొట్టవచ్చినట్టు కని పిస్తోంది.ఈ పరిస్థితులకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత వరకు బాధ్యులని చెప్పక తప్పదు. ఇంట్లో మాతృభాషలో మా ట్లాడడం మానేస్తున్నారు.

మమ్మీ,డాడీ అంటే సంబరపడిపోతున్నా రు. అమెరికా వంటి విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలు మాతృ భాషపై మక్కువతోనే తానా, ఆటా వంటి సంస్థలను స్థాపించి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్నారు. విదేశీయులయినప్ప టికీ సిపిబ్రౌన్‌, సిఆర్‌బ్రౌన్‌, కాల్డ్‌వెల్‌ వంటి మేధావ్ఞలు తెలుగు భాషపై ఎన్నో పరిశోధనలు చేశారు. సిపిబ్రౌన్‌ తెలుగునేర్చుకుని, తెలుగు లోనే ప్రజలతో మాట్లాడి పరిపాలన వ్యవహారాలు సమ ర్థంగా నిర్వహించగలిగాడు. కడపకేంద్రంగా కొన్నాళ్లు నివసించి తెలుగు భాషలోని అమూల్యమైన తాళపత్రగ్రంధాలను సేకరించి పండితులచే వాటిని పరిశీలించి శుద్ధప్రతులు తయారు చేయిం చాడు. సిపిబ్రౌన్‌ కృషి వల్లనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చా యన్నది వాస్తవం. అల్లిబిల్లిగా ఉన్న తాటాకు గ్రంధాలను తెప్పిం చి ఆ పద్యాలను మత, నీతి, అధిక్షేప, మర్మ విషయాలుగా విభ జించిఅయిదోవిభాగాన్ని ‘కలగూరగంపగా విభజించాడు.

1824 నాటికి బ్రౌన్‌ వేమన పద్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి స్వంత ఖర్చులతో ప్రచురించడం గమనార్హం. 1826 మార్చిలో తిరిగి కడ పకు చేరుకున్నప్పుడు తన రచనలు, గ్రంధాల కోసం బంగళా అవసరమని వెయ్యివరహాలతో 15 ఎకరాల తోటలో బంగళా కొని తెలుగుసాహిత్య సముద్ధరణకోసం మహాయజ్ఞం సాగించాడు. పండితులకు స్వంతంగా జీతభత్యాలు చెల్లించి వసుచరిత్ర, మను చరిత్రలకు వ్యాఖ్యానాలు రాయించాడు.వేమన పద్యాలను పరిష్క రించాడు.1829 నాటికి 16వేల పదాలతో నిఘంటువ్ఞ పూర్తిచేశా డు.

బ్రౌన్‌ను ఆదర్శంగా తీసుకుని జెపిఎల్‌ గ్విన్‌ 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించిన తొలికాలంలోహైదరాబాద్‌ సెక్రటేరియి ట్‌లోపనిచేస్తూ తెలుగుభాషా వికాసానికి దీక్షవహించాడు. లండన్‌ లో 1916లో జన్మించిన గ్విన్‌ జిల్లాల్లోని మాండలికాలను అర్థం చేసుకుని తెలుగు అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ 1991లో తెలుగు-ఇంగ్లీషు డిక్షనరీని రూపొందించినప్పుడు గ్విన్‌ కీలకపాత్ర వహించాడు.

1986లో ఎగ్రామర్‌ ఆఫ్‌ మోడర్న్‌ తెలుగుఅనే గ్రంధాన్ని వెలువరించాడు. హైదరాబాద్‌లో 1975లో ప్రపంచతెలుగు మహాసభల సందర్భం గా అఖండ గౌరవ పురస్కారం గ్విన్‌కు లభించింది. ఈ విధంగా ఎందరో మేధావ్ఞలు విదేశీయులు తెలుగుభాషకు పట్టంకట్టగా స్వ రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం మాతృ భాష శ్వాససన్నగిల్లుతోంది. తెలుగు మాట్లాడగలు గుతున్నా చదవడం,రాయడంరాదని తెలుగువారే కొందరు చెప్పడం సిగ్గు చేటు. గతంలో అధికార భాషా కమిషన్‌ తెలుగు తప్పనిసరి భోధ నాంశంగా పాఠశాలల్లో అమలు చేయడానికి ప్రయత్నించింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక భాషపై నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యు కేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రయి నింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి), మినిస్ట్రీఆఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌డి) సర్వే నిర్వ హించగా పదోతరగతి విద్యార్థుల్లో మాతృభాష తెలుగు ఎంత అధ్వాన్నస్థితికి చేరుకుందో బట్టబయలవ్ఞతుంది.

తెలుగుకన్నా, మ్యాథ్స్‌,సోషల్‌సైన్స్‌,ఇంగ్లీషుల్లో విద్యార్థులు ముందంజలో ఉన్న ట్టుతేలింది. దీన్నిబట్టి తెలుగు మాధ్యమంగా ప్రాథమిక స్థాయిలో ఎన్నో మార్పులు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రాచీనభాషే అని గుర్తిస్తూ మద్రాస్‌హైకోర్టు తీర్పుఇచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్లో చెప్పుకోదగిన స్పందన కనిపించడం లేదు. తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందింది కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులతో తెలుగు భాషా సముద్ధరణకు ఎన్నో పనులు చేయవచ్చు. సామాన్య ప్రజా నీకానికి సులువ్ఞగా అర్థమయ్యేలా వాడుకభాషలో పాలనా వ్యవ హారాలు సాగేలా చూడవచ్చు. ప్రాచీన, ఆధునిక ఉత్తమ గ్రంధాల ను ముద్రించి ప్రాచుర్యం కలిగించవచ్చు. తెలుగుసాహిత్యంపై పరిశోధనలు ముమ్మరంగా సాగించవచ్చు.

ఇవన్నీ యధాతథంగా సాగాలంటే పాలకవర్గాల్లో చిత్తశుద్ధి అవసరం. ప్రపంచంలో అవ సానదశలో ఉన్న భాషల జాబితాలో మన దేశమే 196 భాషలతో అగ్రస్థానంలో ఉంది. ఈ 196 భాషలు ఆఖరి శ్వాసలో ఉన్నాయ నిఅర్థం. ఒక భాష ఆఖరి శ్వాసలో ఊగిసలాడుతుందంటే అది అదృశ్యమవ్ఞతుందని అర్థం. ఆ భాష మాట్లాడే వారిలో తరాలు మారి, అవసరాలు మారడం వల్లనే ఇటువంటి ప్రమాద పరిస్థితి దాపురిస్తుంది. కొత్తతరం వారు తమ మాతృభాషను విస్మరించి ఇతరభాషల వ్యామోహంలో వెంపర్లాడడం కొన్నితరాల మాతృభా షాసంస్కృతికి,సహజస్వభావాకృతికి పతనం ప్రారంభమయినట్టే.

– పి.వెంకటేశం