మాట‌ల సియం, చేత‌ల సియం కాదుః జ‌గ్గారెడ్డి

Jaggareddy
Jaggareddy

సంగారెడ్డిః తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లీం మైనార్టీలను మోసం చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై పల్లెబాట నిర్వహిస్తున్న ఆయన.. ముస్లీం మైనార్టీలకు కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ సంగారెడ్డిలో ఒక్కరోజు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్‌కు మాటలెక్కువ, పని తక్కువ అని వ్యాఖ్యానించారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ వీలుకాదని తెలిసికూడా కేవలం ఓట్లకోసం కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు. తనను ముఖ్యమంత్రి చేస్తే కేవలం నాలుగు నెలల్లోనే ముస్లీంలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినట్లు రికార్డు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగు నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్న కేసీఆర్ నాలుగేళ్లయినా అమలు చేయట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.