మాటల్లో ఆగ్రహం.. చేతల్లో అనుగ్రహం

               మాటల్లో ఆగ్రహం.. చేతల్లో అనుగ్రహం

punjab national bank
punjab national bank

ఇప్పటికే ఎందరో ఘరానా పెద్దలు వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. చట్టాలన్నా, ఈ నిబంధనలన్నా జంకు,బొంకు లేకుండాపోయింది. అంతేకాదు అటు దర్యాప్తు అధికారుల పట్ల కూడా వారికి పెద్దగా భయభక్తులు లేకుండాపోయాయి. కర్రలేనివాడిని గొర్రె కూడా కరుస్తుందంటారు. అలా వ్ఞంది మన దర్యాప్తు అధికారుల పరిస్థితి. చట్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు కుల,మత, వర్గ,లింగ బేధాలు లేకుండా అందరికి సమానంగా వర్తించే విధంగా శాసనాలతో రాజ్యాంగాన్ని రూపొందించారు. అవి నిస్ప్రక్షపాతంగా అమలు చేస్తారని ఆశించారు. కానీ అమలు చేయాల్సిన కొందరు అధికారులు రాజకీయ ఒత్తిడిలకు లొంగో, దక్షిణలకు ప్రలోబపడి చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని నాటి రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేకపోయారు. ఫలితంగా వందలాది కరుడుగట్టిన నేరస్తులు ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైట్‌కాలర్‌ నేరస్తులు తప్పించుకోగలుగుతున్నారు.

ఒకసారి మోసపోతే దగా చేసినవారి తప్పు. రెండో సారి మోసపోతే నీదే తప్పు అంటారు పెద్దలు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుండి వందల, వేలసార్లు పాలకులు మోసపోతూనే ఉన్నా రు. అధికారంలో ఎవరు ఉన్నా, కారణాలు, కారకులు ఎవరైనా ఈ దోపిడీ యధేచ్ఛగానే జరుగుతున్నది. ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమార్కుల పాలైనాయో లెక్కలకు అందకపోవచ్చు. ఇప్పుడు తాజాగా వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ విదేశీ వాణిజ్యం పేరుతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును పదకొండువేల నాలుగువందల కోట్ల రూపాయలకు మోసగించడం ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్న ది. ఇంత పెద్ద దగా చేసిన ఆయన, ఆయన సన్నిహితులు దేశ సరిహద్దులు దాటిపోయిన తర్వాత పాలకవర్గం కళ్లుతెరిచింది. తొలి ఫిర్యాదు అందేలోగానే ఆయన దేశం నుంచి తప్పించుకున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంతటి అభద్రతతో కొనసాగుతున్నదో మరొ కసారి రుజువైంది.

ఎన్నిచట్టాలున్నా, నిబంధనలు ఎంత కఠినతరం చేసినా తనిఖీ వ్యవస్థలున్నా, ఇవి అమలు చేసి బ్యాంకుల సొమ్మును కాపాడేం దుకు నెలనెలా వేలు, లక్షల రూపాయల జీత భత్యాలు తీసుకుంటున్న అధికార గణం ఉన్నా ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. కేవలం ఇద్దరు వ్యక్తులు ప్రధాన కంప్యూటర్‌ వ్యవస్థ కళ్లుగప్పి ఈ మోసానికి సహకరించారని ప్రాథ మిక దర్యాప్తును బట్టి అధికారవర్గాలు చెబు తున్నాయి. బ్యాంకులను మోసం చేసి ఇలా వేలకోట్లు దోచుకుపోవడం ఇదిమొదటిదికాదు.

చివరిది కూడా కాకపోవచ్చు. ఇప్పటికే ఎందరో ఘరానా పెద్దలు వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాల్లో విలా సవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. చట్టాలన్నా, ఈ నిబంధ నలన్నా జంకు, బొంకు లేకుండాపోయింది. అంతేకాదు అటు దర్యా ప్తు అధికారులపట్ల కూడా వారికి పెద్దగా భయభక్తులు లేకుండా పోయాయి. కర్రలేనివాడిని గొర్రె కూడా కరుస్తుందంటారు. అలా వ్ఞంది మన దర్యాప్తు అధికారుల పరిస్థితి. చట్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది కూడా నిజమే కావచ్చు..మన రాజ్యాంగ నిర్మాతలు కుల,మత, వర్గ,లింగ బేధాలు లేకుండా అందరికి సమా నంగా వర్తించే విధంగా శాసనాల తో రాజ్యాంగాన్ని రూపొందించా రు.అవి నిస్పక్షపాతంగా అమలు చేస్తారని ఆశించారు. కానీ అమలు చేయాల్సిన కొందరు అధికారు లు రాజకీయ ఒత్తిడిలకు లొంగో, దక్షిణలకు ప్రలోబపడి చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుం టారని నాటి రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేకపోయారు.

ఫలితం గా వందలాది కరుడుగట్టిన నేరస్తులు ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైట్‌కాలర్‌ నేరస్తులు తప్పించుకోగలు గుతున్నారు. సమర్థవంతంగా దర్యాప్తు జరిపి పటిష్టంగా రికార్డులు తయారు చేసి అవసరమైన సాక్ష్యాలను కోర్టుముందు నిలబెట్టి నేరాన్ని రుజువ్ఞ చేయడంలో దర్యాప్తు అధికారులు ఘోరంగా విఫల మవ్ఞతున్నారు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల దర్యాప్తు సక్ర మంగా ముందుకు నడవకపోతే మరికొన్ని సందర్భాల్లో అధికారులే కేసులు వీగిపోయేలా రికార్డులు తయారు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అధికారులు సకల అవస్థలు పడి కోర్టుల ముందు రుజువ్ఞలకు సర్వంసిద్ధం చేసినప్పుడు రాజకీయ కారణంగా పాల కులు మోకాలొడ్డిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పాలకుల చర్య లు సమర్థవంతంగా దర్యాప్తు చేసేఅధికారులకు నిస్పృహను పెంచు తున్నది.

ఇక చట్టం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన సిఆర్‌పిసి, ఐపిసి నిబంధనలు కాలానుగుణంగా సవరించా లనే దర్యాప్తు అధికారుల వాదన కూడా సమంజసమే కావచ్చు. కానీ ఉన్న నిబంధనలను, చట్టాలను ఏ మేరకు నిస్పక్షపాతంగా అమలు చేస్తున్నారనేదే ప్రశ్న.ధనిక,పేద, తేడాలేకుండా ఎంతవరకు చిత్తశుద్ధితో వ్యవహరించగలగుతు న్నారనేదే ముఖ్యం. ఏ అండా లేని నిరుపేదలు పోలీసు స్టేషన్‌కు వస్తే ఎలా వ్యవహరిస్తారు? వారిని ఏదోనేరంపైఅదుపులోకి తీసుకున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? అలాగే ఘరానా పెద్దల విషయంలో ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తారో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరంలేదు.అందుకే వైట్‌కాలర్‌ నేరా లు అంతకంతకుపెరుగుతున్నాయి.మద్యం వ్యాపారి విజ§్‌ుమాల్యా కేసును కూడా ఇందుకు ఉదహరించవచ్చు. భారతీయ బ్యాంకులకు ఈయన దాదాపు తొమ్మి దివేల కోట్లకుపైగా టోకరా వేశారు. 2016లోపలు బ్యాంకులు మార్చిలో సుప్రీంకోర్టును ఆదేశించా యి.

ఆయన విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని నిరోధిం చాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు సుప్రీంకోర్టును అభ్యర్థించాయి. న్యాయస్థానం స్పందించేలోగా ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. గత ఏడాది లండన్‌లో అరెస్టు అయినా వెంటనే బెయిల్‌ దొరికింది. భారత్‌కు తీసుకువచ్చేందుకు దర్యాప్తు అధికారులు చేస్తున్న ప్రయ త్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. ఇక కార్పొరేట్‌ కంపెనీలకు సలహాదా రుగా పనిచేసిన దీపక్‌తల్వార్‌ ఆదాయపన్ను ఎగవేయడంలో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌ లాంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లావాదే వీలు జరిపారు. భారీగా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఆయుధాల వ్యాపారరంగంలో అత్యంత వివాదాస్పదుడిగా పేరు పొందిన సంజ§్‌ు బండారి ఇంటిపై జరిపిన దాడుల్లో రక్షణ శాఖ కొనుగోళ్లు సంబంధించిన అత్యంత రహస్యసమాచారం దొరికింది. అధికార రహస్య చట్టాల కింద ఢిల్లీలోని న్యాయస్థానం ఆయనను నేరస్తుడిగా ప్రకటించింది. దర్యాప్తు అధికారులు అప్రమత్తం అయ్యే లోగా ఆయన విదేశాలకు పారిపోయాడు.

ఇలా ఎన్నో కేసులు ఉద హరించవచ్చు. ఇక పలు బినామీ కంపెనీల పేరుతో ఖాతాలు తెరిచి బ్యాంకును భారీగా మోసం చేశారనే ఆరోపణతో ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్‌ ఒకరిని ఈఏడాది జనవరిలో అరెస్టు చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పూణె జోన్‌ మాజీ అధిపతిని దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలకుపైగా దగా చేశారని గత ఏడాది సిబిఐ అరెస్టు చేసింది. నిబంధనలను అతిక్రమించి ఒక సరుకు రవాణా సేవల కంపెనీకి ఫోర్జరీ పత్రాల ఆధారంగా రెండువేల ఎనిమిది వందల కోట్లరూపాయల రుణం ఇచ్చినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే కెనరా బ్యాంకు, విజయాబ్యాంకులను మోసం చేసి దాదాపు ఏడువందల తొంభై కోట్ల మేరకు రుణం పొంది ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించిన కేసులో అజిత్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్రూప్‌ సంస్థలు దాదాపు పదకొండువేల కోట్లకుపైగా అప్పులు తీసుకొని తిరిగి చెల్లిం చలేకపోతున్నాయి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారధ్యంలోని ఇరవైఐదు బ్యాంకుల కన్సార్టియం నుంచి కోల్‌కతాకు చెందిన గణేష్‌ జ్వెలరీ హౌస్‌ అప్పులు తీసుకొని రెండువేల కోట్లకుపైగా నష్టం చేసినందుకు ఆసంస్థ ప్రమోటర్‌ నిలేష్‌ ఫరేఖ్‌ను అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అశోక్‌ విహార్‌ శాఖలో 2016లో ఐదువేల కోట్ల విదేశీమారక ద్రవ్యం బదిలీకుంభకోణం వెలుగుచూ సింది. ఈ కేసులో మనిష్‌తోపాటు మరో నలుగురిని దర్యాప్తు అధి కారులు అరెస్టుచేశారు.ఇలా చెప్పుకుంటూపోతే గత రెండు, మూడు దశాబ్దాలుగా బ్యాంకులను మోసం చేసే ఘరానా పెద్దలు పెరిగిపో తున్నారు.

ఇందులో ఆయా బ్యాంకులకు సంబంధించిన కొందరు అధికారులు కూడా చేయి కలుపుతున్నారనేది కాదనలేని వాస్తవం. సాధారణ ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లి ఒక లక్షరూపాయల అప్పు కావాలంటే సవాలక్ష ప్రశ్నాలు అడుగుతారు.నెలల తరబడి బ్యాంకు ల చుట్టూ తిప్పించుకుంటారు. ఇచ్చే రుణానికి నాలుగు రెట్లు అదనంగా విలువ ఉన్న ఆస్తులను తనఖాపెట్టుకుంటారు. వాయిదా ఒక్కసారి ఆలస్యమైనా ఇంటి మీద వచ్చి కూ ర్చుంటారు. కొన్ని బ్యాంకులు అయితే ఈ అ ప్పులు వసూలు చేయడంలో వడ్డీ వ్యాపారస్తు లను మించిపోతున్నాయి. కానీ అదే బ్యాంకు యాజమాన్యాలు పెద్దల విషయంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఇక ఫైనాన్స్‌కంపెనీల విషయానికి వస్తే ఇందులో ప్రత్యక్షంగా మోసపోతున్నది సాధారణ పౌరు లే.

మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో అనేక బోగస్‌ ఫైనాన్స్‌కంపెనీలు పెట్టి లక్షలాది మంది అమాయకుల కష్టార్జితాన్ని కొల్లగొట్టి బోర్డులు తిప్పేస్తే జీవితకాలం పాటు సంపాదించుకున్న డబ్బు పోగొట్టుకొని న్యాయం చేసేవారు లేక బాధితుల వేదన అరణ్యరోదనగా మారి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంద ర్భాలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా కేవలం ఈ ఫైనాన్స్‌ కంపెనీల కారణంగా కోట్లాది మంది బాధితులు తాము కూడబెట్టు కున్న డబ్బును పోగొట్టుకున్నారు.

ఇందులో రికవరీ మాట ఎలా ఉన్నా నిందితులపై చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువనే చెప్పొ చ్చు.కొందరు ఎలాంటి భయం,జంకు లేకుండా బాహాటంగానే తిరు గుతున్నారు. ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి మొదలు కొని ఐదువందల కోట్లవరకు మోసం చేసిన ఫైనాన్స్‌కంపెనీల యజ మానులపై చర్యలు తీసుకోవడంలో నిందితులను పట్టుకొని బాధితు లకు న్యాయం చేయడంలో దర్యాప్తు అధికారులు సఫలీకృతం కాలే కపోతున్నారు.ఇక ఒకేఫ్లాట్‌ను ఇద్దరిముగ్గురికి అమ్ముతూ కొన్నిసార్లు అయితే లేని ఫ్లాట్లను విక్రయించడం ఇలా ఇళ్ల స్థలాల అమ్మకాల్లో ఘరానా మోసంచేసిన పెద్దలు ఎందరో నిర్భయంగా తిరుగుతున్నా రు. ఏదోరకంగా డబ్బు సంపాదించగలిగితే తమను ఎవరు ఏమీ చేయలేరనే భావన రోజురోజుకు పెరిగిపోతున్నది.

అందుకే ఒకరిని చూసి ఒకరు పోటీ పడి ఇటు ప్రజలను అటు బ్యాంకులను మోసం చేసి కోట్లకు పడగెత్తుతున్నారు. చాలా కేసులు పోలీసుల రికార్డుల వరకు వెళ్లడం లేదు. పోయిన డబ్బు ఎలాగో పోయింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లితే తిరగడం తప్ప మరేమీ ఉండదని ఆ వైపునకు అడు గులు వేయడం లేదు. వైట్‌కాలర్‌ నేరాలు ప్రధానంగా బ్యాంకులను మోసం చేసేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలి. అవసరం అయితే చట్టాన్ని సవరించాలి.

అంతేతప్ప మాటల్లో ఆగ్రహం కార్యా చరణలో అనుగ్రహం చూపిస్తే ఇలాంటి నేరగాళ్లు మరింత పెరిగి అసలు బ్యాంకులపైన, దర్యాప్తు సంస్థలపైన విశ్వాసం సన్నగిల్లే ప్రమాదంఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరాచకం ప్రబలుతుంది.
– దామెర్ల సాయిబాబ