మాటలకే పరిమితమైన ప్రయాణికుల భద్రత

PATNA
Patna Train Accident

మాటలకే పరిమితమైన ప్రయాణికుల భద్రత

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 130మందికిపైగా మరణించా రు. మరో రెండువందల మందికిపైగా క్షత గాత్రులయ్యారు.ఇందులో కొందరిపరిస్థితి ఆందోళనకరం గాఉంది. కాన్పూర్‌ దేహత్‌జిల్లా కేంద్రానికి వందకిలో మీటర్ల దూరంలో ఉన్న వ్ఞఖ్రాయన్‌ వద్ద ఆదివారం తెల్ల వారుజామున మూడుగంటల సమయంలో ఇండోర్‌- పాట్నా ఎక్స్‌ప్రెస్‌ పాట్నా నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

హఠాత్తుగా 14 బోగీలకుపైగా పట్టాలు తప్పడంతో రైలు పడిపోయింది. ఉజ్జయిని స్టేష న్‌ నుంచి రైలు బయలుదేరగానే చక్రాల శబ్దాల్లో మార్పు వచ్చిందని దీనిని గమనించిన తాము కోచ్‌లో ఉన్న రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ప్ర యాణీకులు చెప్తున్నారు.రైలుప్రమాదాలలో ఇది మొదటి దికాదు, చివరిది కాదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పట్టాలు విరగడమో లేక పగుళ్లు రావడమో కారణమై ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయా ణీకులు గాఢనిద్రలో ఉన్నారు.మృతిచెందిన వారిని గుర్తు పట్టే కార్యక్రమం ఇంకా పూర్తికాలేదు. తీవ్రగాయాలకు గురైన ప్రయాణీకులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ పెనువిషాదం పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైల్వే మంత్రితో సహా పలువ్ఞరు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి సంతాపం ప్రకటించారు. నష్టపరిహారం అందిస్తామని హామీలిచ్చారు. భద్రత అన్నది రైల్వేల్లో గాలిలో దీపంలా తయారవ్ఞతున్నది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే పటిష్టతకు భద్రతకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్లు పాలకులు ప్రకటిస్తున్నా అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్ర మాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రధానంగా రైలుపట్టాలు వాతావరణ పరిస్థితులను బట్టి వ్యాకోచ సంకోచాలతో దూరం, దగ్గర కావడం వల్ల ప్రమాదాలకు కారణమవ్ఞతున్నాయనే వాదన కూడా ఉంది.రైళ్లు పట్టా లు తప్పడం, బోగీల్లో మంటలు చెలరేగడం, క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నా యి.

రైళ్లు పెరిగే కొద్దీ వేగం పెంచే కొద్దీ ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో పెరిగిపోతున్నాయి. 1988లో కేరళలోని అష్టముడి సరస్సులో హైలాండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పడిపోవడంతో 107 మందికిపైగా మరణించారు. అలా గే అదేసంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్‌ సమీపం లో జరిగిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 75 మంది, బీహార్‌లో రైలుకు నిప్పు అంటుకోవడంతో 70 మంది మరణించారు.2002లో బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా లో హౌరా-ఢిల్లీ రాజధానిఎక్స్‌ప్రెస్‌ దావేనదిలో పడ డంతోవందమందికిపైగా మరణించారు. అంతకుముందు 1999లో అసోంలోని కైసిల్‌వద్ద రెండురైళ్లు ఢీ కొనడం తో 290 మందికిపైగా మృతిచెందారు. పంజాబ్‌లో జరి గిన మరో ప్రమాదంలో 212 మంది, 2010 పశ్చిమ బెంగాల్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించడం తో 150 మంది మృతిచెందారు. కాపలా లేని గేట్ల వద్ద మరణాల సంఖ్య చెప్పాల్సిన పనిలేదు.

ప్రయాణీకుల భద్రతకు సంబంధించి అనేకజాగ్రత్తలు తీసుకొంటున్నట్లు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నది. ప్రస్తుత ప్రమాదానికి గురైన పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కూడా 14గంటల పాటు వివిధ విభాగాల సిబ్బంది భద్రతా అధికారి పర్య వేక్షణలో పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేసి పంపారు.ఒక కోచ్‌లో ఉన్న ఎనిమిదివందల రకాల పరిక రాలను పరిశీలించిన తర్వాత ఇంజన్‌పనితీరు సక్రమం గా ఉందని తేలిన తర్వాతనే రవాణాకు ఫిట్‌గా ఉందన్న ధృవీకరణ పత్రం అందిస్తారు.ఆ తర్వాతనే రైలు ప్రయా ణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్ని మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రైల్వేకోచింగ్‌ యార్డులో అనేక విభాగాలను ఇప్పటికే ప్రైవేటీకరించారు. ఇందులో ప్రైవేట్‌ వ్యక్తులే కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రధాన స్టేషన్లలో ఆగిన తర్వాత ఇంజన్‌ బోగీల పరిస్థితి ఎలా ఉందో క్షుణ్ణంగా పరిశీలించాలి. రైలు ప్రతి స్టేషన్‌ ను దాటేటప్పుడు భద్రతా సిబ్బంది, స్టేషన్‌ మేనేజర్‌తో సహా ఇరువైపులా ఉండి లోటుపాట్లను పరిశీలించాలి. ఇక ప్రమాదాలకు మూలకారణమవ్ఞతున్న పట్టాల విష యంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తు న్నారు. ప్రతి ఐదుకిలోమీటర్లకు ఒక వైపునకు ఒక ట్రాక్‌ మ్యాన్‌, మరోవైపునకు మరో ట్రాక్‌మ్యాన్‌ను వెళ్లి పరిశీ లించాలి.ఇవేమి అంత పకడ్బందీగా జరగడంలేదని రైల్వే శాఖ అధికారులే అంటున్నారు.
ముఖ్యంగా భద్రతా సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడంతో పట్టాల తనిఖీ నామమాత్రంగా జరుగుతున్నది. అసలు రైల్వే భద్రతా వ్యవస్థను మెరుగుపరచడానికి అనిల్‌ కకోద్కర్‌ శాంపి ట్రోడో నేతృత్వంలో రెండు ప్రత్యేక కమిటీలు ఎంతో అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలు అటకెక్కించా రు. మరొకపక్క రైల్వేశాఖలోని కీలకమైన ఇంజినీరింగ్‌ విభాగంపైతీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి.కాంట్రా క్టు ఇష్టారాజ్యంగా మారిపోయిందనే విమర్శలున్నాయి. ఏదిఏమైనా భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జరుగుతు న్న సంఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లు భద్రతవిభాగంలోని ఉద్యో గుల ఖాళీలు ప్రమాదాలను పెంచుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పాలకులు భద్రతవిషయంలో ప్రత్యే క శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త