మాటకు, మనసుకూ అదుపు

CUTE
CUTE

మాటకు, మనసుకూ అదుపు

మనుషుల్లో ఎన్ని రకాల రూపురేఖలుంటాయో, మనసుల్లోనూ అంతే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పలేం. అయితే అందరి సంగతి సరే ఎవరికి వారు మనం ఎప్పుడు ఎలా ఉంటాం అనే విషయం మనకైనా స్పష్టంగా తెలుసా. అంటే ఏ సందర్భంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన భావోద్వేగాలను ఎలా చూపిస్తున్నాము, అనే విషయంపై పూర్తి అంచనా ఉందా? అలా ఉంటే వాటిని సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏఏ విషయాల పట్ల ఎక్కువగా స్పందిస్తున్నారు అనే అంశాన్ని పరిశీలించండి. భావో ద్వేగాలు అనగానే అన్నీ చెడే అనుకోనక్కర్లేదు. మనకు మంచిగా ఉపకరించేవీ ఉంటాయి.

ఉదాహరణకు మీలో జిజ్ఞాస ఎక్కువ ఉంటే ఎంతో విజ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ సహ ఉద్యోగుల పట్ల మీలో ఆసక్తి, వారితో కలిసి పనిచేయాలనే ఇష్టం ఉన్నపుడు ఆఫీసుకి హషారుగా వెళ్లగలుగుతారు. ఏదైనా సందర్భంలో కోపం, ఆవేశం, అనంగీకారం- ఇవికలిగినపుడు వాటినిఅలాగే ఉంచుకుని సమస్య ని పరిష్కరించడానికి పూనుకోకూడదు. వీటిని పక్కకు పెట్టగలిగితేనే అసలు సమస్య పరిష్కారమవుతుంది. ఆయాభావాలు ఏసందర్భాల్లో మీలోపెచ్చరిల్లుతున్నాయి , వాటిని ఎలా ఆపాలి అనే విషయాల మీద ఒక పరిశీలన, అవగాహన ఉండాలి. ్య ఎవరితోనైనా ఏదైనా విషయంపై వాదిస్తున్నపుడు మాటల్లో ‘నువ్వు అనేమాటని ఎక్కువ వాడకూడదు.

‘నువ్వు అనే మాటతో చెప్పదలచుకున్న విషయాన్ని కూడా ‘నేను అంటూ చెప్పవచ్చు. నువ్వు అనే పదం ఎక్కువ వాడుతుంటే ఎదుటివారికి మనం వారిని ఎత్తిచూపుతున్నట్టు ఉంటుంది. అదే నేను ఇలా అనుకుంటున్నాను అంటే సర్దిచెబుతున్నట్టు ఉంటుంది. ఏవైనా భావోద్వేగాలు మిమ్మల్ని కుదిపి వేస్తున్నపుడు వెంటనే వాటికి అనుగుణంగా స్పందించకుండా కాస్త విరామం తీసుకోండి. మీలో అలాంటి భావాలను కలిగించిన సందర్భం ఏమిటో ఒక్కసారి గమనించండి. వాటిని పునరాలోచిం చండి.

అలా నిదానంగా ఆలోచిస్తే నెగిటివ్‌ స్పందనలు కచ్చితంగా కాస్తయినా తగ్గుతాయి. ్య బాగా కోపం వచ్చినపుడు లేదా దేనికైనా బాగా కలత చెందినపుడు ఆ ప్రభావం మనసుమీద, శరీరం మీద పడుతుంది. శరీరంలో వణుకు, టెన్షన్‌ స్పష్టంగా తెలుస్తుంటాయి. ఆ సమయాల్లోనే చాలామంది కోపంతో కేకలు వేయటం, ఏడవటం చేస్తుంటారు. ఇలాంటపుడు వెంటనే చేయాల్సిన ఆలోచన, పని- మనసుని శాంతబరచుకోవటం, అలాగే శరీరాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవటం. ్య ఒక్కోసారి ఉద్యోగ నిర్వహణలో ఉన్నపుడు బాధ కలిగి దుఃఖం వచ్చే సందర్భాలు ఎదురు కావచ్చు. ఇటువంటపుడు సంయమనం పాటిం చడం చాలా కష్టంతో కూడుకున్న పని.

వెంటనే అక్కడికక్కడే కళ్ల నుంచి జలజలా నీళ్లు రాల్చడం మంచిపని కాదు. విధి నిర్వహణలో కలిగే బాధకు పలువురు వ్యక్తులు, సంఘటనలు కారణమై ఉండవచ్చు. ఫలితం మీరు అనుభవించవలసి రావచ్చు. ఒకవేళ మీరే కారణమైనా వెంటనే ఏడుపులోకి వెళ్లకుండా తరువాత కర్తవ్యం ఏమిటి అనే విషయంవైపు మీ దృష్టిని మళ్లించాలి. ఒకవేళ ఆపుకోలేని దుఃఖం కలిగితే ఎవరూ చూడకుండా జాగ్రత్తపడటం మేలు. తిరిగి చిరునవ్వుని పెదవుల మీదకు తెచ్చుకుని అందరిలోకి రండి.