మాక్స్‌వెల్‌ను తీసుకోండి: గిలెస్సీ

s111
gilessy

బెంగళూరు టెస్టుకు మాక్స్‌వెల్‌ను తీసుకోండి: గిలెస్సీ

న్యూఢిల్లీ: బెంగళూరులో 4 నుంచి జరిగే రెండవ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులోకి మిచల్‌ మార్ష్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లేన్‌ మాక్స్‌వెల్‌ను తీసుకోవడమే మంచిదని ఈ దేశ మాజీ పేసర్‌ జాసన్‌ గిలెస్సీ పేర్కొన్నాడు. తద్వారా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇంకా బలంగా ఉంటుందని గిలెస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోపీలో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడాల్సిన సమయంలో తుది జట్టులోకి మాక్స్‌వెల్‌ను తీసుకోవాలని సెలక్టర్లకు ఆయన సూచించాడు.

భారత పర్యటనలో ఉన్న ఆసీస్‌ జట్టు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మిగతా టెస్టు మ్యాచ్‌లకు మాక్స్‌వెల్‌ను తుది జట్టులోకి తీసుకోండి.మ్యాక్సీని జట్టులో తీసుకుంటే ఆసీస్‌ ఇంకా బలపడుతుంది.
భారత్‌లో స్పిన్‌ను ధైర్యంగా ఎదుర్కొనే ఆటగాళ్లలో మాక్స్‌వెల్‌ ఒకడు అని వివరించాడు.ఇద్దరు సీమర్ల తో ఆడాలిన భావిస్తే మిచెల్‌ మార్ష్‌ స్థానంలో అతని తీసుకుంటే మంచిది.ఆసీస్‌ మరింత సమర్థవంతంగా సిరీస్‌లో ముందు కెళుతుంది అని గిలెస్సీ సెలక్టర్లనకు సూచించాడు.నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించడంతో సిరీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.తద్వారా 12 సంవత్సరాల తరువాత భారత్‌తో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని గెలిచింది.అంతేకాదు 19 వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన విజయపరంపరకుకూడా ఆస్ట్రేలియా బ్రేక్‌ వేసింది.