మాకు లాభాలు వద్దు ప్రజల సౌకర్యాలే ముఖ్యం!

acchenaidu
acchenaidu

అమరావతి: అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆర్టీసిలో తమకు లాభాలు అక్కర్లేదని ప్రజల సౌకర్యాలే ముఖ్యమని అన్నారు. కొత్త డిపోలు, గ్రామాలకు బస్సులు, రాజధానికి ఆక్యూపెన్సీ రేటు 75 శాతానికి తీసుకొచ్చామని ఆక్యూపెన్సీ 85శాతానికి వస్తే నష్టాలు తుగ్గతాయన్నారు. 60 స్లీపర్‌ బస్సులను కొనుగోలు చేస్తున్నామని. ఈనెలలో అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. రూ.200కోట్లతో పల్లెవెలుగు బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని రూట్లలో పల్లెవెలుగు బస్సులు తిప్పుతామని అన్నారు.