మహేష్‌ సినిమాలో మెరవనుంది!

NAYANA INN

మహేష్‌ సినిమాలో మెరవనుంది!

ఇప్పటివరకు మహేష్‌ బాబు, నయనతారతో కలిసి నటించనేలేదు. తాజాగా వీరిద్దరు ఒకేతెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు, మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను ఫైనల్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేసుకొని, చెన్నై, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉందట. కథకు ఈ పాత్ర ఎంతో కీలకమని చెబుతున్నారు. ఆ పాత్రకు ఎవరైతే బావుంటారని ఆలోచిస్తున్న సమయంలో నయనతార అయితే పెర్ఫెక్ట్‌ అని భావించిన మురుగదాస్‌ ఆమెను దృష్టిలో పెట్టుకొని పాత్రను మరింత వైవిధ్యంగా రూపొందించి.. ఆమెకు వినిపించరాట. తన పాత్ర నయన్‌ ను బాగా ఎగ్జైట్‌ చేయడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో కూడా నయనతార, మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమాలో కనిపించింది. ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. నయన్‌ పాత్ర సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందని చెబుతున్నారు.