మహేష్‌ సరసన నటించటం లేదట..

ILIYANA-2
ILIYANA

మహేష్‌ సరసన నటించటం లేదట..

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌ను వదిలేసి చాలా ఏళ్లయింది.. ఒకసారి బాలీవుడ్‌ వెళ్లిపోయాక ఆమె తిరిగి తెలుగు తెరవైపు చూడలేదు.. అయితే ఉన్నట్టుండి ఇపుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించబోయే కొత్తసినిమాలో ఇలియానా కథానాయికగా నటించబోతోందని, మహేష్‌ ఆమె పేరును రికమండ్‌ చేశాడని, ఇలియానా కూడ సానుకూలంగానే ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.. చాలా మంది ఇది నిజమని నమ్మారు.. కానీ ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని మహేష్‌వంశీ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు స్పష్టం చేశాడు.. తమ సినిమాలో ఇలియానా నటించట్లేదని, అసలు ఈచిత్రం హీరోయిన్‌ ఎవరో ఇంకా ఖరారు చేయలేదని రాజు స్పష్టంచేశారు..హీరోయిన్‌ ఫైనలైజ్‌ అయ్యాక తామే వెల్లడిస్తామని రాజు తెలిపారు.. దీంతో రెండురోజుల ఊహాగానాలకు తెరపడింది.. మహేష్‌-వంశీ సినిమా ప్రారంభం కావటానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది.