మహేష్‌ మల్టీప్లెక్స్‌లో రజనీకాంత్‌ ?

MAHESH, RAJANI KANTH
MAHESH, RAJANI KANTH

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇటు సినిమాలు చేస్తూనే, ,మరవైపు మల్టీప్లెక్స్‌ బిజినెన్‌లో బిజీగా ఉన్నారు.. మహేష్‌ ఏపషియన్‌ సినిమాస్‌తో కలిసి.. ఏఎంబి సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ థియేటర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మొదట అమీర్‌, అమితాబ్‌ ల థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ చిత్రంతో థియేటర్లనుఓపెన్‌ చేయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు.. కాగా తాజాగా రజనీకాంత్‌ 2.0 చిత్రంలో ఏఎంబి మల్టీప్లెక్స థియేటర్లను ఓపెన్‌ చేయాలని మహేష్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. 2.0 చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందంతో పాటు రజనీకాంత్‌ హైదరాబాద్‌కు రానున్నారు. ఆ సమయంలోనే రజనీకాంత్‌ , 2.0 యూనిట్‌ చేతులమీదుగా థియేటర్లను ప్రారంభిస్తారని అనుకుంటున్నారు.. కాగా ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్లు భారీ సాంకేతిక హంగులతో నిర్మించబడ్డాయి.. ప్రేక్షకులు సినిమా చూడటానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని తెలుస్తోంది.. ఇక మహేష్‌ ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.