మహేష్‌ కోసం మరో స్టంట్‌ మాస్టర్‌!

MAHESH!!!
Mahesh Babu

మహేష్‌ కోసం మరో స్టంట్‌ మాస్టర్‌!

మహేష్‌ బాబు తాజా చిత్రం కోసం ముందుగా యాక్షన్‌ సీన్స్‌ ను షూట్‌ చేస్తూ వెళుతున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ను అనల్‌ అరసు.. పీటర్‌ హెయిన్స్‌ కంపోజ్‌ చేశారు. అయితే దర్శకుడు మురుగదాస్‌ తాజాగా రవివర్మ అనే మరో స్టంట్‌ మాస్టర్‌ ను రంగంలోకి దింపాడు. గతంలో అఖిల్‌ సినిమాకి పనిచేసిన రవివర్మ, ప్రస్తుతం ధ్రువ సినిమాకి చేస్తున్నాడు. మహేష్‌ సినిమా కోసం ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ ను కొత్తగా డిజైన్‌ చేయమని మురుగదాస్‌ కోరడంతో, ఆయన ఆ పనిలో నిమగ్నమయ్యాడని చెబుతున్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీసర్‌ గా మహేష్‌ కనిపించే ఈ సినిమాకి, ముగ్గురు స్టంట్‌ మాష్టర్లు పనిచేస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ సినిమాలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది.