మహీంద్ర కొత్తగా రూ.1500 కోట్లు పెట్టుబడి

Mahindra
Mahindra

మహీంద్ర కొత్తగా రూ.1500 కోట్లు పెట్టుబడి

ముంబై: దేశీయంగా పటిష్టమైన సంస్థగా కొనసా గుతున్న మహీంద్ర అండ్‌ మహీంద్ర తాజాగా నాసిక్‌ ఇగత్‌ పురి ఉత్పత్తి కేంద్రాలపై రూ.1500 కోట్లు పెట్టుబడులు పెడ తామని ప్రకటించింది. మహారాష్ట్రలో ఉన్న ఈ రెండుప్లాంట్ల ను మరింతగా విస్తరిస్తామని కొత్త ఉత్పత్తి యు321 అభివృద్ధి చేసేందుకు ఈపెట్టుబడులు ఉపకరిస్తాయని చెపుతోంది. ఈ కొత్త కోడ్‌ నేమ్‌తో వస్తున్న యు321ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని కంపెనీ ప్రకటించింది. నాసిక్‌ ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తి జరుగు తుంది. ఇగత్‌పురి ప్లాంట్‌లో పెట్టుబడులు ఇంజన్లను ఉత్పత్తిచేసి సరఫరా చేస్తుందని అంచనా. ఈ పెట్టుబడులతో కేవలం నాసిక్‌వరకే పరిమితం కాకుండా మొత్తం మహారాష్ట్ర ప్రాంతం అభివృద్ధికి మహీంద్ర కీలకపాత్ర పోషిస్తున్నట్లవుతుందని ఎంఅండ్‌ఎం ఎండి పవన్‌గోయంకా వెల్లడించారు. ప్రభు త్వం ఈ రెండు ప్లాంట్లలో పెట్టుబడుల తర్వాత ఈప్రాజెక్టుకు అల్ట్రామెగా ప్రాజెక్టు హోదాను ఇచ్చింది.