మహీంద్ర అమ్మకాల్లో పతనం

MAHINDRA
MAHINDRA

మహీంద్ర అమ్మకాల్లో పతనం

న్యూఢిల్లీ,జూలై 3: ఆటోమేజర్‌ మహీంద్ర కంపెనీ మొత్తం అమ్మకాల్లో8శాతం క్షీణత కనిపించింది. గత ఏడాది 39,009 యూనిట్లు విక్రయిస్తే ఈ ఏడాది 35,716 యూనిట్లు విక్రయించింది. దేశీయ మార్కెట్లలో అమ్మకాలు మూడుశాతం మేర దిగజారాయి. 33,861 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 34,989 యూనిట్లు విక్రయించింది. ఎగుమతులు కూడా 54శాతం దిగజారి 4020 యూనిట్ల నుంచి 1855యూనిట్లకు పడిపోయాయి. స్కార్పియో, ఎక్స్‌యువి500, గ్జైలో, బొలేరో, వెరిటో వంటి ప్యాసింజర్‌ కార్లుఐదుశాతం క్షీణించి 16,170 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదేనెలలో 17,070యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్యవాహనాల విక్రయాలు 12శాతంపెరిగి 13,538 యూనిట్ల నుంచి 15,131యూనిట్ల కు పెరిగాయి. జిఎస్‌టి అమలువల్ల పడే భారం తగ్గించుకోవడం కోసం తమవద్ద ఉన్న స్టాక్స్‌ను తగ్గించడంపైనే దృష్టిపెట్టినట్లు ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా వెల్లడించారు. ప్రాథమికంగా ఎదురయ్యే అనిశ్చితిని ఎదుర్కొన్న తర్వాత జిఎస్‌టికి ఆటోమొబైల్‌ రంగం అలవాటుపడు తుందని, జిఎస్‌టి ద్వారా ఆర్థికవ్యవస్థలో కొత్త శకానికి నాందిపలికి నట్లవుతుందన్నారు.