మహీంద్రా నుంచి కొత్త కారు

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తాజాగా మరాజో ఎమ్‌పివి వాహనాన్ని సోమవారం మార్కెట్లో లాంచ్చేసింది. 2002 విడుదల చేసిన స్కార్పియో లాగానే మరాజో వాహనం కూడా మార్కెట్లో రాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఉత్తర అమెరికాలోని డిట్రా§్ు సమీపంలోని టెక్నికల్ సెంటర్, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఇంజిన్‌ను, ఇటాలియన్ డిజైన్ హౌస్ పినిఇన్ ఫెరీరా భాగస్వామ్యంతో మరాజో డిజైన్‌ను తయారు చేసినట్లు తెలిపింది. ఇండియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించారని తెలిపింది. దీనిలో 1.5లీటర్ సామర్థ్యం గల ఎమ్‌ఫాల్కన్ డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 120 బిహెచ్పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్చేస్తుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ లాంటి ప్రధాన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇది మొత్తం నాలుగు మోడళ్లలో ఉన్నాయి. అవి ఎం2, ఎం4, ఎం6, ఎ8గా మహీంద్రా మరాజో ఎమ్‌పివిని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు ఎం2 మోడల్ రూ.9.99లక్షల నుంచి మొదలవుతుంది. ఎం8 ధర రూ.13.90లక్షలుగా నిర్ణయించింది.