మహిళా సాధికారతకు దర్పణం జన్‌ధన్‌

Ladies reervation

మహిళా సాధికారతకు దర్పణం జన్‌ధన్‌

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పథకం జనధన్‌ యోజన (జెడివై) లబ్ధిదారుల్లో 50 శాతం మంది మహిళలే ఉన్నారని గణాంక వివరాలు చెబుతున్నాయి. మహిళా సాధికారతకు, స్వయం సామర్థ్యానికి ఇది నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి 17 నాటికి ఈ పథకం కింద 30.97 కోట్ల ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 16.34 కోట్లఖాతాలు మహిళలకు చెందినవి కావడం విశేషం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మహిళలను లక్ష్యంగా చేసుకుని మరిన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అధికారవర్గాలు చెబుతు న్నాయి. ప్రజలను ముఖ్యంగా పేదలను ఆర్థికపరంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో అనుసంధానం చేయాలన్న సంకల్పంతో 2014లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

బ్యాంకులో ఖాతాలు లేక చాలా మంది పేద ప్రజలు ప్రభుత్వ పథకాలను సరిగ్గా వినియోగించుకోలేక పో తున్నారు. ఈ పథకంలో మహిళా లబ్ధిదారులు చొరవ చూపడంతో వారికి ప్రయోజనం కలిగించే మరిన్ని పథకాలు అమలులోకి రాడానికి దోహదపడుతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతు న్నాయి. మొత్తం రూ. 73,689 కోట్లు డిపాజిట్‌ కాగా ఇందులో రూ. 30.97కోట్లు జనధన్‌ యోజన పథకం కింద డిపాజిట్‌ అ య్యాయి.ఇందులో మళ్లీ గ్రామీణ, నగర ప్రాంతాల నుంచి ఎందరు డిపాజిట్‌ చేశారో కూడా వివరించారు. గ్రామీణ లేదా సబర్బన్‌ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అంటే 18.21 కోట్ల వరకు ఖా తాలు తెరవగా, అర్బన్‌ సెంటర్ల నుంచి 12.76 కోట్ల వరకు ఖాతా లు ప్రారంభమయ్యాయి. ప్రజాబాహుళ్యం ఈ ఆర్థికబంధంలో అత్యధికంగా భాగస్వామ్యం కావాలన్న ఆశయంతో ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ చెల్లింపు, ప్రమాదబీమా పరిధి లక్ష రూపాయల వరకు కల్పించడం తదితర రాయితీలను ఎన్నిటినో ప్రకటించింది.

బ్యాంకులో ఎలాంటి బ్యాలెన్సు లేకపోయినా లబ్ధిదా రులు ఈ ఖాతాలను నిర్వహించే అవకాశం కల్పించింది. ఇంకా మరో రూ.30వేలు కూడా రాయితీలకు కలుపుతారు. బ్యాంకులు ఈ విషయంలో అవగాహన శిబిరాలను నిర్వహించి ప్రజలు ఖాతాలు తెరిచేలా ప్రోత్సహించాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారు లు ఈ ఖాతాల ద్వారా నేరుగా లావాదేవీలు జరుపుకోడానికి వీల యిందని ప్రజలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే రూపేకార్డులను ఖాతాదారులకు అందచేశారు.

మోడీ ప్రభుత్వ ప్రధాన అజెండా మహిళా సాధికారతగా సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు శ్లాఘిం చారు. ఉజ్వలయోజన పథకం ప్రధాన ప్రయోజనం గ్రామీణ ప్రాం తాల్లో ఎల్‌పిజి కనెక్షన్లను ఉచితంగా గృహిణులకు అందచేసి మహి ళా సాధికారతను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ప్రపంచవాణి జ్యవేత్తల సదస్సులో మోడీ ఇటీవల ప్రసంగిస్తూ భారతదేశ ప్రగతిలో మహిళా సాధికారతకు విశిష్టమయిన పాత్ర ఉందని వివరించారు. ముద్రయోజన పథకంపై మోడీ మాట్లాడుతూ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ పథకం వల్ల ఎక్కువగా లబ్ధిపొందారని ముద్రయోజన పథకం ద్వారా సులువ్ఞగా పదిలక్షల (ఒక మిలియన్‌) రూపాయల వరకు ఆర్థిక సాయం పొందవచ్చని చెప్పారు. 2015లో ముద్రయోజన ప్రారంభమయింది. మంజూరైన 90 మిలియన్‌ రుణాలలో 70 మిలియన్‌రుణాలు ఈ పథకం కిందనే మహిళా ఔత్సాహిక పారిశ్రామికులకు మంజూరయ్యాయి.

మద్యం నుంచి దూరం చేసిన ‘జనధన్‌ ప్రధాన మంత్రి జనధన్‌ యోజన (పిఎంజెడివై) బ్యాంకు అకౌంట్ల ను ఎవరైతే తెరిచారో ఆయా గ్రామీణుల జీవితాల్లో ఆదాయం పొదుపు, దుర్వ్యసనాలకు డబ్బులు ఖర్చుపెట్టకుండా జాగ్రత్త పడ డం తదితర మంచి లక్షణాలు కనిపించాయని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఎకనామిక్‌ రీసెర్చి విభాగం అధ్యయనంలో వెల్లడయింది. మద్యపానం, ధూమపానం తదితర వ్యసనాలకు డబ్బు ఖర్చుపెట్టకుండా జనధన్‌ యోజన అకౌంట్‌దారులు జాగ్రత్త పడ్డారని అధ్యయనం వెల్లడించింది. ఈ పిఎంజెడివై పథకం ప్రారం భించినప్పుడు చాలా మంది భయపడ్డారు.తమ డబ్బంతా ఖాతాల్లో పోగుపడుతుందని అత్యధిక నగదు లావాదేవీలు ద్రవ్యోల్బణానికి తాకుతాయని అపోహపడ్డారు.

అయితేరిటైల్‌ ద్రవ్యోల్బణం ఆధారంగా సేకరించిన సమాచారంపై ఈ అధ్యయనం సాగించారు. రాష్ట్రాలు ఏవైతే తమగ్రామాల్లో జన్‌ధన్‌ ఖాతాల్లో 50 శాతం కన్నా ఎక్కువ భాగస్వామ్యం ఉన్నాయో ద్రవ్యోల్బణంలో అర్థవంతమయి న తగ్గుదల కనిపించింది. 30 కోట్ల జన్‌ధన్‌ ఖాతాల్లో చాలా ఖాతాలు 2016 నవంబరు లో పెద్దనోట్ల రద్దు తర్వాతనే ప్రారంభమయ్యాయి. కేవలం 10 రాష్ట్రాల్లో 23 కోట్లు అంటే 75 శాతం ఖాతాలు ప్రారంభమ య్యాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌ 4.7 కోట్ల ఖాతాలతో అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 3.2 కోట్ల ఖాతాలు, పశ్చిమబెంగా ల్‌లో 2.9 కోట్ల ఖాతాలు ప్రారంభం అయ్యాయి. గ్రామీణ, పట్టణ వినియోగ దార్ల కన్సూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌పై జన్‌ధన్‌ ఖాతాల ప్రభా వాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ఆర్థిక పరిస్థితి యధాత థంగా ఉన్నా, ఆర్థికంగా కొంత పొదుపు పాటించడంతో స్పష్టమ యిన ఫలితాలు కనిపించాయని అధ్యయనం విశ్లేషించింది. గ్రామీణులు పొదుపునకు అలవాటు పడడమేకాక మద్యపానానికి గ్రామీణులను దూరం చేయడంలో జనధన్‌ యోజన ఖాతాలు బాగా ప్రభావితం చేశాయి.

మద్యం, పొగాకు ఉత్పత్తుల కొనుగోలులో బాగా తగ్గుదల కనిపించడంతో సంతృప్తికరమైన, అర్థవంతమైన మార్పు కనిపిం చింది. జనధన్‌ యోజన ఖాతాలు ఏరాష్ట్రంలో ఎక్కువగా తెరిచారో అక్కడే పై మార్పులు చోటు చేసుకోవడం విశేషం.

ఎస్‌బిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అధ్యయనం నోట్ల రద్దు తరువాత తక్కు వ ఖర్చు పెట్టే జీవన శైలికి సంకేతంగా పేర్కొనవచ్చు. అంతే కాకుండా 2016 అక్టోబర్‌ నుంచి బీహార్‌, పశ్చిమబెంగాల్‌, మహా రాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇంటి వైద్యం ఖర్చులో కూడా పెరుగు దల కన్పించింది. వ్యక్తిగతంగా తమవద్ద ఉన్న డబ్బును విచ్చల విడిగా వినియోగించే నైజంలో కూడా మార్పు కనిపించింది. బ్యాంకులో నగదు దాచుకోడానికి, స్వంతంగా ఖర్చుపెట్టడానికి మధ్య తేడా బాగా కనిపించింది. ముఖ్యమయిన విషయం ఏమంటే జనధన్‌ ఖాతాల కారణంగా పొదుపు చేసే సంస్కృతి పెరిగింది.

– దొరయ్య