మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు భారీ బందోబస్తు

Gowtham sawang
Gowtham sawang

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు భారీ బందోబస్తు

విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ గౌతమ నవాంగ్‌ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు.. పవిత్ర సంగమం వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు ఉంటుందన్నారు.. మహిళా ప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలు తీసకుంటామన్నారు.. భద్రతకోసం 5వేల మంది పోలీసులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. వేదిక పరిసరాల్లో 500 మంది మహిళా పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సిసి కెమేరాలు, బాడీవేర్న కెమేరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. సదస్సు వేదికకు వచ్చే పలు మార్గాలల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తామన్నారు.. క్పుష్ణా పుష్కరాల తరహాలో భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామన్నారు.