మహిళా నేతకు రియల్‌ఎస్టేట్‌ బాధ్యతలు అప్పగించిన: చంద్రబాబు

N. Chandrababu
N. Chandrababu

తణుకు: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథార్టీ సంస్థకు డైరెక్టర్‌గా ముళ్లపూడి రేణుక ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం సిఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన పై ఎంతో నమ్మకంతో సిఎం ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో వినియోగదారులు మోసపోకుండా చూడటానికి పూర్తిసమాచారాన్ని పారదర్శకంగా అందించడానికి ఈ సంస్ధ కృషి చేస్తోందన్నారు. ఇక పై ఎల్‌పి ఉండదని రేరా పరిధిలోనే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉంటుందన్నారు. ఈరేరా డైరెక్టర్‌ పదవికి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ హోదా లభిస్తుందని ఆమె తెలిపారు.