మహిళా కబడ్డీ

kabaddi
kabaddi

ఆర్‌కె ఫిలింస్‌ పతాకంపైప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘మహిళా కబడ్డీ.. రచనస్మిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది.. ఇటీవల మూడవ షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది.. ఈచిత్రం కోసం ఉగాది పండుగపై ఒక ప్రత్యేక పాటను సంగీత దర్శకుడు బోలే షావళి సంగీత సారధ్యంలోరూపొందించారు. ఈపాటను ఉగాది సందర్భంగా మంగళవారం ఫిలిం ఛాంబర్‌లో ‘మా అధ్యక్షుడు శివాజీరాజా ఆవిష్కరించారు.. ఆయన మాట్లాడుతూ ఆర్‌కె ఫిలింస్‌ అంటే తన సొంత బేనర్‌ లాంటిదని అన్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఈ బేనర్‌లోనే నటించానని అన్నారు. ఉగాది పండుగపై చేసిన పాటను తను లాంచ్‌ చేయటం ఆనందంగా ఉందన్నారు. దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడâత, చాలా గ్యాప్‌తర్వాత తాను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రమిదని అన్నారు. ఒక పల్లెటూరి అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయిలో కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందనేది ప్రధాన కథాంశమన్నారు. రచన స్మిత్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారని అన్నారు. శివాజీరాజా కూడ ఒక కీలకపాత్ర చేస్తున్నారన్నారు. ఈచిత్రంలో ఫేమస్‌ సింగర్‌ మంగిలి కూడ ఒక పాట పాడారన్నారు. రాజ్‌కిరణ్‌ కంపోజ్‌ చేసిన ఆ పాటను ఉగాది పండుగ తర్వాత రిలీజ్‌ చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ ముత్యాల రాందాస్‌, ఏడిద శ్రీరామ్‌, సింగర్‌ వరం, సంగీత దర్శకుడు బోలే షావలి తదితరులు మాట్లాడారు.