మహిళల మర్యాద పెరిగేదెపుడు?

LADY-1
LADY

మహిళల మర్యాద పెరిగేదెపుడు?

అన్నిరంగాల్లో తమ సత్తా చాటుకుంటున్న స్త్రీ లోకానికి ఇంకా సమాజం నుండి పూర్తి రక్షణ లేకపోవడం మనదేశ సంస్కృతికి, చట్టాలకు ఒక సవాలులాంటివి. దేశంలోని అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా సరైన గౌరవ మర్యాదలు స్త్రీలోకం పొందలేకపోతున్నది. స్త్రీలు కూడా దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ఈరోజుల్లో వారి గురించి గౌరవంగా ఆలోచించాలి. వారికి తగిన విధంగా సమాజపరంగా, ప్రభుత్వపరంగా సౌకర్యాలు కల్పించాలి.

అప్పుడేవారు మరింత ఆశావహ దృక్పథంతో ముందుకెళ్లగలరు. ్య స్త్రీలు తమ సమస్యలు, హక్కులకే పరిమితం కాకుండా, ప్రజాస్వామ్య విలువల కొరకు, సమసమాజ నిర్మాణం కొరకు జరుగుతున్న ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న మహిళలు తమ స్ఫూర్తిని జగమంతా వ్యాపింపచేయాలి. ప్రపంచంలోని అత్యధికభాగంలో గ్రామీణాభివృద్ధి, ఆహారభద్రతలో వెనుకబాటుతనానికి కారణం భూ యాజమాన్యంపై స్త్రీ, పురుషుల మధ్య పెద్ద ఎత్తున నెలకొని ఉన్న అసమానతా కారణం.

మానవాభివృద్ధి నివేదికల్ని పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ ఒక్కదేశంలో కూడా స్త్రీలు పురుషులతో సమానంగా పరిగణించబడడం లేదు.

స్త్రీలు నిర్వహిస్తున్న పాత్రకు, స్త్రీలు చేస్తున్న పనులకు విలువ కట్టడం లేదు. పనిలో, గనిలో, కార్ఖానాలో, పంటపొలాలలో ఉత్పత్తి జరిగే ప్రతిచోటా మగవాడి కన్నా 13శాతం అధికంగా శ్రమిస్తున్నది. అధికంగా ఉత్పత్తి చేస్తున్న మహిళలే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్త్రీలకు సమానత్వము నిరాకరించబడుతుంది. ్య సామాజిక గుర్తింపు అనేది చూస్తే మహిళ ఇప్పటివరకు తండ్రిచాటు బిడ్డగా, సోదరుల చాటు అక్కగానో, చెల్లిగానో, భర్తకి భార్యగానో కుమారుల తల్లిగానో గుర్తింపుకు పరిమితమయ్యినది. సామాజిక గుర్తింపు అనేది, ఆర్థిక స్వావలంబన, రాజకీయంగా స్త్రీ ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది.

మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతిభావంతులైన మహిళలకు కుటుంబ సభ్యుల, ప్రభుత్వం ప్రోత్సాహం కావాలి. ప్రభుత్వం మహిళా చట్టాలను సక్రంగా అమలయ్యేలా చూసి, మహిళలకు భద్రత కల్పించి ఉద్యోగ ఉపాధిరంగాలలో అవకాశాలు కల్పించాలి. సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ భాగస్వాములే. స్త్రీ అభ్యుదయమే సమాజాభ్యుదయము. స్త్రీల గౌరవాభిమానాలు పెంపొందాలంటే స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలి. ్య భ్రూణహత్యలను నియంత్రించాలన్నా, మహిళలపై హింసను రూపుమాపాలన్నా, స్త్రీ పురుష సమానత్వం సాధించాలన్నా ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేసి, చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. మహిళలపై ఏరకమైన హింసకు పాల్పడినా చెల్లుతుందనే నిర్బీతిని, నిర్లక్ష్యాన్ని అంతం చేయాలి. స్త్రీలపై వివక్ష, చిన్నచూపును అంతంచేసే విధంగా మానసిక వైఖరుల్లో మార్పు తీసుకురావాలి.

ప్రస్తుత వ్యవస్థలో మహిళలకు భద్రత కరువైంది. కుటుంబహింసతో పాటు పనిప్రదేశాల్లోనూ, వీధుల్లోనూ, కళాశాలల్లోనూ వేధింపులు అధికమైనది. నేడు స్త్రీ బయటకు వెళ్లి స్వేచ్ఛగా విహరించే పరిస్థితులు కరువయ్యాయి. స్త్రీలు, పురుషులు మద్యపానం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని రకాల వేధింపులను ఎదుర్కొనేందుకు స్త్రీలు ధైర్యంతో ముందంజవేయాలి. స్త్రీలకు గౌరవాన్ని ఆపాదించడం కన్నా మానసిక సంఘర్షణలు అనుభవింప చేసే సందర్భాలే ఎక్కువ. మహిళల పట్ల వివక్షత నానాటికీ అధికం అవ్ఞతుంది.

ఒక సాధారణ మహిళ మేధోసామర్థ్యం, ఒక సాధారణ పురుషుని మేథోసామర్థ్యం ఒకేలా ఉంటాయని మేథోసామర్థ్య పరీక్షలు రుజువ్ఞ చేశాయి. మహిళలకు సరైన అవకాశాలిచ్చినట్లయితే వారు అన్నిరంగాలలో పురుషులతో సమానంగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. మహిళలు పురుషులతో సమానస్థాయిని చేరుకోకపోవటానికి ప్రధానకారణం వారికి విద్యను, ఇతర అవకాశాలను పురుషులతో సమానంగా అందించకపోవడమే.

ఎన్ని కొత్త చట్టాలు చేసినా, ప్రత్యేక కోర్టులు నెలకొల్పినా నేను ఇంటాబయటా మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అపరిష్కృతంగానే ఉంటున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలపై రకరకాల అత్యాచారాలు తగ్గడం లేదు. మహిళా సాధికారత కోసం మహిళా సంఘాలు మరింత ఉద్యమించి రాజకీయాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ తప్పక సాధించాలి. ఎన్నికల సమయంలో తమకు రిజర్వేషన్‌ కల్పించే పార్టీకే ఓటేస్తామని మహిళలు అన్ని పార్టీల వారిని నిలదీయాలి.చట్టాల పట్ల మహిళలందరకూ అవగాహన కల్పించాలి.

స్త్రీలు అన్ని విధాలుగా పురుషులతో సమంగా సరితూగగలరు. కానీ సామాజిక పరిస్థితులు వార్ని అబలలుగా మార్చాయి. స్త్రీలకు కావలసిది స్వేచ్ఛ కాదు. పురుషాధిక్యత భావజాలం నుండి విముక్తి కావాలి. కుటుంబం నుంచి మార్పు రావాలి. ఆడపిల్లలను మగపిల్లలను సమానదృష్టితో చూడాలి. మహిళలకు చట్టాలపైనా, వ్యవస్థపైనా పూర్తిగా అవగాహన కలగాలని, తమ హక్కులని తాము గుర్తించాలి. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడటం మానుకోవాలి. ప్రపంచంలో కలుగుతున్న మార్పులకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మహిళలు తాము పనిచేస్తున్న రంగాల్లో ఎలాంటి అసమానతలు కొనసాగుతున్నాయో గుర్తించాలి.

మహిళా ఉపాధ్యాయులు వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి. మహిళలకు నిర్ణయాధికారం రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా, చదువ్ఞ ద్వారా నైతిక విలువలు పాటించడం ద్వారా, మంచి చెడులు విచక్షణ ద్వారా సాధించవచ్చును. ఆర్థికంగా కొంత సమానత్వాన్ని సాధించినప్పటికి సాంస్కృతికంగా సమానత్వ స్థాయిని పురుషునితో సమానంగా సాధింపబడలేదు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానస్థాయిలో నైపుణ్యాలను సాధించాలి.

మహిళ రెండవతరగతి వ్యక్తి, తక్కువ, అధమురాలు ఇవన్నీ కూడా పితృస్వామిక ఆలోచనలు. ఈ ఆలోచనలు చాలామంది స్త్రీలలో కూడా బలంగా పనిచేస్తున్నాయి. తాము రెండవతరగతికి చెందినదని అనుకుంటుంది.

ముందుగా స్త్రీలలోనే మార్పు రావాలి. తాను పురుషుడి కంటే తక్కువ అనే మనోభావాలు నుండి బయటపడాలి. ్య మహిళలు అన్ని రంగాలలో ముందడుగు వేయాలి. కేవలం వంటింటికి పరిమితం కాకుండా మగవారితో ఇంటాబయటా ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా సహనంతో తమ ప్రతిభను చాటుకోవాలి. ప్రతి మహిళా మరో మహిళలతో సహృదయ భావంతో, స్నేహ భావంతో మెలుగుతూ, ఒకరి కష్టాలను ఒకరు తెలుసుకుంటూ తమలోని ఐకమత్య భావనను తెలిసేలా మెలగాలి. అప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సంఘటిత శక్తి పెంపొందుతుంది.

చట్ట సభలలో రిజర్వేషన్‌ శాతాన్ని ప్రవేశపెట్టిన దాని పూర్తి ఫలాలు మహిళలకు అందినపుడు మాత్రమే మహిళల జీవితంలో మార్పు వస్తుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి మాత్రం ఏకాభిప్రాయం లేదని తాత్సారం చేయటం మోసపూరిత కుట్ర. జనాభాలో మేమెంతమందిమో మాకంత వాటా కావాలి. రాజ్యాధికారంతో సహా సమస్త రంగాల్లో మావాటా మాక్కావాలి. తుదివరకు పోరాడతాం అని మహిళలు ఉద్యమించాలి.అన్న లెనిన్‌ మాటలు నిజమైన నాడు భారత స్త్రీ నిజంగా ఆ స్థాయికి వచ్చిన నాడు అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమానతలు తగ్గుతాయి.