మహిళల తొలి టి20లో భారత్‌ ఘన విజయం

INDIA TEAM
INDIA TEAM

మహిళల తొలి టి20లో భారత్‌ ఘన విజయం

సెన్‌వెస్‌ పార్క్‌, ఫిబ్రవరి 13 : దక్షిణాఫ్రికా మహిళలతో మంగళవారం జరిగిన తొల టీ 20 మ్యాచ్‌లో భారత మహిళలు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత మహిళలు టీ 20 మ్యాచ్‌లో ఆలవోకగా నెగ్గారు.దక్షిణాఫ్రికా నిర్దేసించిన 164 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్‌ వేద కృష్ణమూర్తి 22 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో (37), కెప్టెన్‌ మిథాలిరాజ్‌ 48 బంతులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో (54) పరుగులు చేయడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు.