మహిళల టీ20లో విండీస్‌పై ఆస్ట్రేలియా విజయం

australia women's
australia women’s

ఆంటిగ్వా: మహిళల టీ20 ప్రపంచకప్‌ భాగంగా తొలి సెమీఫైనల్లో వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ నిర్జీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్‌ హేలీ(46; 38బంతుల్లో 4ు4. 1ు6), కెప్టెన్‌ లానింగ్‌(31; 39బంతుల్లో 2ు4), రచేల్‌ హేన్స్‌(25నాటౌట్‌; 15బంతుల్లో 4ు4) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ జట్టు ఆరంభం నుంచి తడబడుతూనే వచ్చింది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ టేలర్‌(16; 28బంతుల్లో 1ు4) మాత్రమే టాప్‌స్కోరర్‌.  కాగా 17.3ఓవరల్లోనే విండీస్‌ 71 పరుగులకు అలౌటైంది.