మహిళల గౌరవం పెరిగేదెన్నడు?

LADY--
LADY–

మహిళల గౌరవం పెరిగేదెన్నడు?

కులం, మతం, అభివృద్ధి రాజ్యం పేరుతో ఎన్ని రకాలుగా హింసించబడుతున్నా మహిళలు ఎక్కడా ఆగింది లేదు. మీటూ అంటూ తమకు జరిగిన అన్యాయాలపై ఒక ఉద్యమంలా బయటకొచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ప్రతి మహిళలకు సమస్యలపై పూర్తి అవగాహన వుండాలి. నిర్ణయం తీసుకునే శక్తి సమస్యలను స్వయం శక్తితోపరిష్కరించుకునేలా ప్రతి మహిళా ఎదగాలి. స్త్రీగా మనం ఇన్ని పాత్రలు గృహిణిగా, ఉద్యోగినిగా, తల్లిగా, భార్యగా, పోషిస్తున్న పిల్లల పెంపకంలో వివక్షత లేకుండా చిన్నప్పటి నుండి పిల్లలకి మహిళలను గౌరవించే సంస్కృతి అలవాటు చేయాలి. సర్వగుణ సంపన్నులం, ఇంట మహాలక్ష్మీలం, భూమి మీద సగభాగులం. ఆకాశంలో కూడా సగం. కానీ విద్య, వైద్యం, స్వేచ్ఛ,´ భద్రత, నిర్ణయాధికారాల్లో వెనకబడిన వాళ్ళం. మహిళలకు వారికంటూ స్వంత నిర్ణయశక్తి లేదు. వారి జీవితాలపై నిర్ణయం వారిది కాదు. కుటుంబాలదే. మహిళ ఒక పరిపూర్ణం. తానే సృష్టించగలదు, పెంచగలదు, మార్చగలదు. తల్లిగా, భార్యగా, కుమార్తెగా వారి బాధ్యతల ముందు వారి కష్టాలు కనిపించవు. దేశజనాభాలో 65 కోట్ల మంది మహిళలే. జనాభాలో దాదాపుగా సగం వరకున్నా, వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే దక్కుతున్నాయి. సామాజిక మార్పు ద్వారానే మహిళల సంపూర్ణ వికాసం సాధ్యపడుతుంది. మహిళల పనులను ప్రత్యేకించడం, లింగవివక్షత, ఉత్పాదక వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్ధిక అసమానతలు పెరిగిపోయి మహిళలు సంపూర్ణ పౌరులుగా మారడానికి అవరోధంగా నిలుస్తోంది. సాంఘిక, ఆర్ధికరంగాలలో లైంగిక సమానత్వం, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడంలోనూ, స్వతంత్రం కలిగి ఉండటమే గాక వివక్షాపూరిత నిర్ణయాలకు వ్వతిరేకంగా ఉద్యమించి అభివృద్ధి బాటలో నడిచేందుకు సాదికారత తోడ్పడాలని ఐక్యరాజ్యసమితి మహిళ అభివృద్ధి సంస్థ స్పష్టం చేసింది. శాత్త్ర,సాంకేతిక రంగాల్లో అభ్యర్ధలకు అవసరమైన సాంకేతిక, సమాచార, సంభాషణ వ్యవస్థాపక నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలను చేపట్టి వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం ద్వారా మహిళలను సాధికారతకు ప్రభుత్వ పథకాలు తోడ్పడగలవు.

పనిచేసే ప్రదేశాలలో కూడా ప్రతి నలుగురు శ్రామికులలో ఒకరు స్త్రీ, ఎక్కడ ఎక్కువగా సాంకేతికత, క్లిష్టత ఉంటుందో అక్కడ మహిళా ఉద్యోగులు ఎక్కవ కనిపిస్తున్నారు. ఉపాధి సేవలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఉపాధి కల్పనలో, ఆదాయఅర్జనలో సానుకూల ప్రభావాన్ని కలుగజేస్తాయి. నేటి ఆధునిక సమాజంలో మహిళలు మాతృస్వామ్య వ్యవస్థ కంటే స్వేచ్ఛాస్వతంత్రాలతో లేరు. సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ, పురుషులకు సహాజ శ్రమ విభజన వల్ల స్త్రీలు యింటికే పరిమితమయ్యారు. ఒక్క నిముషం తీరికలేని పనులతో సతమతమవుతూ, తన గురించి తాను ఆలోచించుకునే పరిస్థితిలో లేరు. పట్టణ మహిళలతో పొల్చితే గ్రామీణ మహిళలు యింకా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. సంప్రదాయాలు, కట్టుబాట్లపేరిట పితృస్వౌమ్య భావజాలంతో స్త్రీలు హింసకి గురవుతూ ఉన్నారు.

మహిళలు శాస్త్రసాంకేతిక రంగాలతో సహా అన్నింటిలో పోటీ పడుతున్నారు. అధికారులుగా రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. అయినా స్త్రీలు అణచివేతకు, వివక్షకు గురవుతూనే ఉన్నారు. తమ కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి, విద్య తదితర కుటుంబ అవసరాలు తీర్చడానికి మహిళలు తమ వంతు కృషి చేయగలమని మహిళలు ఆత్మవిశ్వాసం కలిగి వుండాలి. జాతీయ కుటుంబ ఆరోగ సర్వే వివరాల ప్రకారం దేశంలో 1549 వయోవర్గంలో ఏళ్ల మహిళల్లో 60శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇంట్లో, బయట, కార్యాలయాల్లో పనిచేసే చోట ఎన్నో రూపాలలో స్త్రీలపై హింస పెరుగుతుంది.

చట్టాలు అమలుకు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. గ్రామీణ స్త్రీలు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. చదువుకుంటే తనకాళ్ల మీద తాను నిలబడితే స్వయం నిర్ణయాదికారం వస్తుందని సిద్ధాంతం చెబుతుంది. మనుధర్మశాస్త్రంలో స్త్రీని కించపరుస్తూ, హీనంగా పురుషునికి ఒక వస్తువుగా పోలుస్తూ స్త్రీకి సమాజంలో కుటుంబంలో గౌరవం లేకుండా చేసింది. ఇదే భావజాలం రాజరికపు వ్యవస్థలో, భూస్వామ్య వ్యవస్థలో, పెట్టుబడిదారి వ్యవస్థలో, మరియు సామ్రాజ్య వాదసంస్కృతిలో కూడ కొనసాగుతుంది. మహిళలు ఏ విషయాల్లోనూ పురుషులకు తీసిపోరు. అవకాశాలను కల్పిస్తే అద్భుతాలను సృష్టించ గలరనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించి వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయగలిగినపుడే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్వవస్థగా ప్రశంసలు అందుకుంటున్న భారతదేశంలో గాంధీజీ కళలు కన్న స్వరాజ్యాన్ని సాధించగలం.

మహిళలను ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న విధాన నిర్ణయాల ఫలితంగానే ఇప్పటి వరకు మరుగున పడి ఉన్న మహిళల నిర్వాహణ సామర్ధ్యం వెలుగులోకి వస్తున్నది. మహిళలలో విద్య అవగాహన స్థాయి పెరగడం వల్ల, తమ స్థాయిని హక్కులను ఉద్యోగ స్థితిగతులను గురించి మరింత ఎక్కువగా తెలసుకుంటున్నందువల్ల వారిలో కొంతమంది ఆర్ధిక భాగస్వామ్యం అభివృద్ధికి నూతన మార్గాలలో అన్వేషించ గలుగుతున్నారు. సాధికారత అనేది ప్రత్యక్షంగా పాటించదగింది కాదని గ్రహించాలి. అది వ్యక్తుల స్వీయ అనుభవాలను బట్టి వారు జీవించే సంస్కృతి నేపథ్యాన్ని బట్టి పరిగణిం చాల్సి ఉంటుంది.

మహిళ అవసరాలు, ప్రాధాన్యతలు, నమ్మకాలకు సాధికారత ను అన్వయింపచేసే విషయంలో లింగపరమైన అంశాలు సహా వివిధ వర్గాలలోని ఉపవర్గాలను ప్రాతిపధిక చేసుకోవాలి. మహిళలకు సత్వర న్యాయం కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి. కుటుంబా నికి, సమాజానికి, మహిళలు అందించే సేవలు వెలకట్టలేనివి. సమాజంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న మహిళలు ఒంటరి స్త్రీలు, వితంతువులు, ఆత్మగౌరవంతో హుందాగా జీవించేలా తోడ్పడేందుకు అవసరమైన కార్యక్రమా లను రూపోందించాల్సిన అవసరమేంతైనా వుంది. కులం, మతం, అభివృద్ధి రాజ్యం పేరుతో ఎన్ని రకాలుగా హింసించబడుతున్నా మహిళలు ఎక్కడా ఆగింది లేదు. మీటూ అంటూ తమకు జరిగిన అన్యాయాలపై ఒక ఉద్యమంలా బయటకొచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నారు.

ప్రతి మహిళలకు సమస్యలపై పూర్తి అవగాహన వుండాలి. నిర్ణయం తీసుకునే శక్తి సమస్యలను స్వయం శక్తితోపరిష్కరిం చుకునేలా ప్రతి మహిళా ఎదగాలి. స్త్రీగా మనం ఇన్ని పాత్రలు గృహిణిగా, ఉద్యోగినిగా, తల్లిగా, భార్యగా, పోషిస్తున్న పిల్లల పెంపకంలో వివక్షత లేకుండా చిన్నప్పటి నుండి పిల్లలకి మహిళలను గౌరవించే సంస్కృతి అలవాటు చేయాలి. ప్రపంచంలోనే అత్యధికంగా మీటూ ఉద్యమం ఊపందుకున్న దేశాల్లో 2018 అక్టోబరుకు గాను భారత్‌ మొదటి స్థానంలో ఉందని గూగుల్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలు సామాజిక మాధ్యమ వేధికలపై తమ వేదనను బహిర్గతం చేయడం సంచలనం సృష్టిస్తోంది. 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం తీసుకోచ్చారు. దీనికి అనుగుణంలో భారత శిక్షాస్మృతిలో సెక్షన్‌ 354ను చేర్చారు.

భారతీయనేర శిక్షాస్మృతి ఐపిసి నిబంధనలు 294 (ఎ) (బి) అశ్లీల చెష్టలు పాటలు 292 అశ్లీల పుస్తకాలు బొమ్మల చూపడం, 509 వెకిలి చేష్టలు అసభ్యంగా ప్రవర్తించడం 354 లైంగిక దాడి, 375,376 అత్యాచారం వున్నాయి. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. లైంగిక వేధింపుల ఫిర్యాదులు ‘షీబాక్స్‌ ద్వారా నమోదు చేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మహిళల వేధింపులను ఫిర్యాదుల స్వీకరణకు అభయం వంటి యాప్‌లు ప్రవేశపెట్టారు. తెలంగాణలో ‘షీ టీమ్స్‌ బృందం ఏర్పాటు సహా అనేక ప్రచార కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రభుత్వం మహిళల భద్రతకు హామీ ఇచ్చింది. దోపిడి అనేది ఆర్ధిక నిర్మాణాలపైన ఆధారపడి ఉన్నది. దోపిడి, పీడిత వ్యవస్థ మారాలి. పితృస్వామ్యాన్ని నిర్మూలించాలి. స్త్రీల పట్ల ప్రేమ, గౌరవం పెంపోందించే నడవడిక సంస్కృతి రూపుదిద్దుకోవాలి. నైతిక విలువలని ప్రేరేపించేలా ప్రచార సాధనాలు మారాలి. మహిళల ఆర్ధిక పౌరసత్వాన్ని బోలపేతం చేయడమంటే కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చి కుటుంబంలో అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్నా మహిళ వ్యక్తిగత ఆశయాలను నెరవేర్చడమే.

– సత్యం