మహిళల్లో కిడ్నీ సమస్యలు

sick
sick

This slideshow requires JavaScript.

మహిళల్లో కిడ్నీ సమస్యలు

ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కిడ్నీ ఫౌండేషన్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్‌ కిడ్నీ దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుతున్నారు. ఇంచుమించు వారమంతా దీనిగురించి సెమినార్లు, చర్చలు జరుగుతూనే ఉంటాయి. రోజురోజుకి పెరుగుతున్న కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన సందస్సులు, నివారణ, జాగ్రత్తల గురించి అవగాహన సదస్సులు, నివారణ, జాగ్రత్తల గురించి ప్రజందరికి తెలియచేయడానికి గత 12 సంవత్సరాల నుండి కృషి జరుగుతుంది.

2006 నుండి 66 దేశాల్లో మొదలైన వరల్డ్‌ కిడ్నీ దినోత్సవం 2016 నుండి 88 దేశాల్లో జరుపబడుతుంది. కిడ్నీల ప్రాముఖ్యత: కిడ్నీలు మన శరీరంలో రెండు చిక్కుడు గింజల ఆకారంలో పిడికిలి సైజులో నడంకిరువైపుల పక్కటెముకల వెనుకభాగం లో ఉంటాయి. ఇవి నాలుగు అంగుళాల ఎత్తు, రెండు అంగుళాల వెడల్పు కల్గి ఉంటాయి. కిడ్నీలు నిమిషానికి 60 ఔన్సుల రక్తాన్ని వడకడతాయి. ప్రతి కిడ్నీలో 1 మిలియన్‌ దాకా నెఫ్రాన్స్‌ వ్ఞండి రక్తాన్ని శుద్ది చేస్తూ, మలినాల్ని మూత్రం రూపంలో బైటికి పంపిస్తాయి. రెండు కిడ్నీలు పని చేస్తే అవి 100శాతం పనిచేసినట్లు లెక్క. క్రానిక్‌ కిడ్నీ డిజీజెస్‌ (సికెడి) వ్ఞంటే కిడ్నీల పనితీరు 50శాతం వ్ఞన్నట్లు. 10-20 శాతం కిడ్నీలు పనిచేస్తే కిడ్నీ ఫెయిల్యూర్‌ వస్తుంది. అప్పుడు కిడ్నీలు చేసే ఫిలరింగ్‌ని డయాలసిస్‌ యంత్రపరికరం ద్వారా చేస్తారు. కిడ్నీ వర్పిడి (రక్తసంబంధీకుల్లో ఒకరి కిడ్నీని) రిస్క్‌ అయినప్పటికి చేయాల్సి వ్ఞంటుంది. ప్రపంచవ్యాప్తంగా 195 మిలియన్స్‌ స్త్రీలు కిడ్నీవ్యాధులతో బాధపడుతున్నట్లు అంచనా. స్త్రీలలో మరణు కల్గడానికి ఇది ముఖ్య మైన 8వ కాణం అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం 600,000మంది మరణించడ జరగుతుంది. స్త్రీలలో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి? కారణాలు: పురుషుల కన్నా స్త్రీలలో రెండింతలు రిస్క్‌ ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో 14శాతం, పురుషుల్లో 12శాతం కిడ్నీ వ్యాధులు వస్తాయి. స్థూలకాయం: స్థూలకాయం 14 శాతం పురుషుల్లో ఉంటే స్త్రీలలో 30 శాతం వ్ఞంటుంది. దీనివల్ల కిడ్నీల పని శరీరంలో మెటబాలిక్‌ అవస రాలకు తగినట్లుగా సరిగ్గా పనిచేయలేకపోవడం జరుగుతుంది. కిడ్నీలపై పనిభారం ఎక్కువైన కొద్దీ కిడ్నీలో నూటికి 30 నెప్రానులు దెబ్బతిని కిడ్నీ డామేజ్‌ జరుగుతుంది. ఇది డైరక్ట్‌, ఇన్‌డైరక్ట్‌గా జరుగుతుంది. గర్భధారణ సమస్యల్‌ు గర్భధారణ సమయంలో ప్రీఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా, హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, మూత్రంలో ప్రోటీన్స్‌ పోవడం, సెప్టిక్‌ అబార్షన్‌, కాన్పు తర్వాత రక్తస్రావం కావడం వంటి హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ వల్ల కడ్నీప్రాబ్లమ్స్‌ వచ్చే అవకాశ ముంది.

పెర్టిలిటీ సమస్యలు, నెలలు నండకుండా కాన్పు కావడం, తల్లిబిడ్డల అనారోగ్య సమస్యలు కిడ్నీల పనితీరుని మందగింపచేస్తాయి. రక్తహీనత: స్త్రీలలో సర్వసాధారణ సమస్య రక్తహీనత. ఇది ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌, మెనోపాజ్‌, బహిష్టులోపాలు, ఇతరక్రానిక్‌ డీసీజెస్‌ వల్ల రక్తహీనత వస్తుంది. దీనివల్ల కిడ్నీల సామర్ధ్యం తగినట్లుండదు. రక్త వ్యాధులు, క్తనాళల వ్యాధులున్నప్పుడు రక్తహీనత ఏర్పడి కిడ్నీ డామేజ్‌కి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్స్‌ స్త్రీలలో మూడింతలు ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్‌ వస్తుం టాయి. కిడ్నీల్లో నెఫ్రాన్స్‌లో లేదా గ్లోమిరూల్స్‌లో ఇన్ఫెక్షన్‌ తరచుగా రావడం. ఇవి గొంతునొప్పి, గవదబిళ్లలు, జాండీస్‌వంటి వైరస్‌ ఇన్ఫె క్షన్స్‌, మలరియా, ఎయిడ్స్‌, టి.బి. వంటి బాకీరియన్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల నెఫ్రయిటిస్‌, పైలో నెఫ్రయిటిస్‌ వంటి కిడ్నీ వ్యాధులు క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీస్తాయి.

దీనికి ముఖ్యకారణం స్త్రీలలో పురుషనాళం (ఆనస్‌) మూత్రవాహికకు దగ్గరగా ఉంటుంది. స్త్రీ మూత్రవాహిక పురుషుల మూత్రవాహికకన్నా పొట్టిగా టుంది. బహిష్టు స్రావాలు, తెల్లమైల, అధిక చెమటల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా వస్తాయి. పురుషనాళంలోని సూక్ష్మక్రిములు మూత్రవాహిక ద్వారా కిడ్నీలకు పురుషులకన్నా తేలికగా స్త్రీలకు వ్యాపిస్తుంది. జననేంద్రియ వ్యాధులు: గనేరియా, సిఫిలిస్‌, హెల్పిస్‌, క్లమడియల్‌, ట్రైకోమొనియాసిస్‌, కాండియాసిస్‌ వంటి సుఖవ ా్యధులు, జననేంద్రియాల వాపు, సర్విసైటిస్‌, మైట్రే టిస్‌ వంటి గర్భసంచి ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈకొలై, స్టఫలోకాకస్‌, స్టెప్టోకాకస్‌, ఫంగస్‌ బార్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల మూత్రకోశం, మూత్రవాహికలు, కిడ్నీలు కూడా వ్యాధిగ్రస్తమవ్ఞతాయి. మందులు: ఇష్టానుసారంగా ఆస్పిరిన్‌, అసిటోమైసిన్‌, డ్రగ్స్‌, బి.పి. షుగర్‌ మందులు, పెయిన్‌ కిల్లర్స్‌ వాడడం వల్ల, టి.బి. ఎపీలెప్సీ, కీళ్లనొప్పులకు వాడే మందులు కిడ్నీ లపై వత్తిడి కల్గిస్తాయి. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్స్‌ దెబ్బ తింటాయి.

– స్త్రీలలో కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, కిడ్నీలకి దెబ్బత గలడం, రక్తస్రావాలు, ఆక్సిడెంట్స్‌, పాయిజన్స్‌, టాక్సిక్‌ ఎఫెక్ట్స్‌, మందులసైడ్‌ ఎఫెక్ట్స్‌,రియాక్షన్స్‌, మానసిక ఒత్తిళ్లు కిడ్నీలపై ప్రభావం చూపించి వ్యాధిగ్రసత్తం చేస్తాయి. – ఆటోఇమ్యూన్‌ డిసీజెస్‌, ల్యూపస్‌ నెఫ్రాపతీ, హైపవర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, కేన్సర్‌, గుండెజబ్బులు క్రానిక్‌ కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. కిడ్నీ హోర్మోన్స్‌: కిడ్నీల్లో ఉత్పత్తి అయ్యే రెనిన్‌ రీనల్‌ హైపర్‌ టెన్షన్‌ని కంట్రోల్‌ చేస్తుంది. ఇది ఎముక మూలగలో ఎర్రరక ్తకణాల తయారీకి, కిడ్నీపైన టోపీలాగా ఉండే ఎడ్రినల్‌ గ్రంధుల్ని ఉత్తేజపరిచి ఆల్డోస్టీరాన్‌ అనే హార్మోన్‌ని విడుదల స్తుంది. ఇవి కిడ్నీల్లోని ట్యూబ్యు ల్ని ప్రభావితం చేసి శరీరంలోని అనవసర వ్యర్ధాల్ని ద్రవాన్ని బైటికి పంపిస్తాయి. ఇవి శరీరంలోని ద్రవాల్ని సరైన స్థాయిలో ఉంచడం, రక్తంలోని లవణాల సమతుల్యతని కాపాడుతాయి.

 డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి