మహిళలు ఆరాధించే శ్రీపాదుడు

SRIPAADUDU
SRI PAADUDU

మహిళలు ఆరాధించే శ్రీపాదుడు దేవ్ఞడికి లింగబేధంలేదు. స్త్రీలైనా పురుషులైనా తన ను భక్తితో పూజించేవారినే దేవ్ఞడు ఇష్టపడతాడు. అలాంటిది శ్రీపాదుడు ఆలయం మాత్రం కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం. దీనికిగల కారణాలను గమనిస్తే పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆ స్వామిని పసుపుతో పూజిస్తే తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఆ ఆలయంలో అడుగుపెడితే తమకు కీడు జరుగు తుందని పురుషులు భయపడతారు. మనదేశంలో బ్రహ్మకు ఆలయాలున్నాయి. విష్ణుమూర్తి వామనా వతారంలో కొలువైన ఆలయం ఉంది. పాండవ్ఞల కు, దుర్యోధనుడికి, రావణుడికి, లక్ష్మణ, భరత, శత్రఘ్నులకు గుడులున్నాయి. అదీ అలాంటి ఓ విలక్షణ ఆలయమే. కానీ, అందులో కుబేరుడు, గరత్మంతుడు, కుంభకర్ణుడు, బలి చక్రవర్తి ఇలా ఎవరో ఒకరు దేవ్ఞడు అనుకుంటే పొరపాటే.

అలా అని అదేదో గ్రామదేవత ఆలయమూ కాదు. ఆ మాటకొస్తే అందులో విగ్రహమే ఉండదు. కానీ, రోజూ కొన్నివందల మంది మహిళలు ఆ ఆలయం లో పూజలు చేస్తారు. శ్రావణం, కార్తీక మాసాల్లో నోములూ వ్రతాలూ నోచుకుంటారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని వేడుకుంటారు. అది ఉత్తరప్రదేశ్‌ చందౌలి జిల్లాలోని సాకాల్‌దిహ గ్రామంలో ఉంది. 1870లో అప్పటి సాకాల్‌ దిహ ప్రాంతాన్ని చాత్రాషా అనే రాజు పాలించే వాడు. అతడు పరమక్రూరుడు. ఆ రాజ్యంలో శ్రీపాదుడు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండే వాడు. తన చుట్టు పక్కల ఉండేవాళ్ల ఆవ్ఞలను రోజూ మేతకు తీసుకెళ్లేవాడు. అలా వచ్చే సంపాదనతోనే ఇల్లుగడిచేది. ఓరోజు శ్రీపాదుడు తీసుకెళ్లిన గోవ్ఞలు రాజుగారి పొలంలోకి వెళ్లి పోయి, పైరును నాశనం చేశాయి. భటులు శ్రీపాదుడిని బంధించి మహారాజు ముందు నిలబెట్టారు.అది రాజు గారి భూమి అని తనకు తెలియదంటూ క్షమించమని అతడు వేడుకు న్నాడు. ‘బ్రాహ్మణుడికి గోవ్ఞలెందుకు? అంటూ రాకుమారులు అవహేళన చేశారు.

చివరికి రాజు శ్రీపాదుణ్ణి కారాగారంలో పడేసి, చిత్ర హింసలు పెట్టాడు. రాజునిరంకుశత్వంతో విసిగి పోయిన శ్రీపాదుడు నిరాహారదీక్ష మొదలుపెట్టాడు. ఓనిరుపేద బ్రాహ్మణుణ్ణి కారాగారంలో బంధిం చారన్న విషయం రాకుమార్తెలకు తెలిసింది. వెంటనే వారు రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి విడిపించమని వేడుకు న్నారు. కానీ, రాజు వినిపించుకోలేదు. దాంతో వారు రాజుకు తెలియకుండా రోజూ రహస్యంగా కారాగారానికి వెళ్లి, శ్రీపాదుణ్ణి పరామర్శించేవారు. కానీ, వారు తెచ్చిన అన్న పానీయాల్ని మాత్రం అతడు స్వీకరించే వాడు కాదు. అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజున రాకుమార్తెలు మంచినీళ్లు, తుల సితీర్థం ఆయన కోసం తీసుకెళ్లారు. ‘మానాన్న, అన్నలుచేసిన తప్పుల్ని క్షమించండి. ఇప్పటివరకూ మీరు ఆహారం తీసు కోలేదు.ఈరోజైనా కనీసం ఈ తీర్థం తీసుకోండి అని బతి మిలాడారు. ‘మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అనిఆశీర్వదిస్తూ ఆయన తులసితీర్థం పుచ్చుకునాడు. వెంటనే తాను కూర్చున్నచోటు ప్రాణాలు వదిలేశాడు.

ఆ తర్వాత ఓరోజు రాజు కుటుంబం రథంలో విహార యాత్రకు బయల్దేరింది. అనుకోకుండా రథందారి తప్పి లోయలోపడి పోయింది. ఆ ప్రమాదంలో రాజు, కుమారులు మరణించారు, రాకుమార్తెలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా శ్రీపాదుడి ఆశీర్వాదమే అని నమ్మిన వారందరూ ఆయనకోసం ఓ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అతణ్ణి బంధించిన కారాగారాన్నే దేవాలయంగా మార్చేశారు. అందులో అతణ్ణి ఉంచిన గదిని గర్భ గుడిగా చేశారు. శ్రీపాదుడు కూర్చున్న చోటునే దైవపీఠంగా భావించి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇది స్త్రీలకోసం స్త్రీలే నిర్మించుకున్న ఆల యం. మా తండ్రి, అన్నల్లాంటి మూర్ఖులందరికీ ఓ గుణపాఠం. నీతి నిజాయితీయులు, నలుగురికీ సాయం చేసే మనస్తత్వం ఉన్న మగాళ్లకే ఇందులో ప్రవేశం. ఆ ఆలయంలో పూజారి కూడా మహిళే. ఆలయంలో విగ్రహంఉండదు. శ్రీపాదుడు కూర్చు న్న ఎత్తైన ఆరుగుకే స్త్రీలు ప్రతిరోజూ పసుపురాసి, నెయ్యి, పూలతో పూజిస్తారు.