మహిళలను కించపరిచే సంస్కృతి నాకు లేదు: తమిళ నటుడు విజ§్‌ు

 

Vijay
Vijay

టీవల విడుదలైన షారుఖ్‌ఖాన్‌ చిత్రం ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌ సినిమా చూసి బాగా లేదని,
విజ§్‌ు నటించిన ‘సుర సినిమాలాగే ఉందని మహిళా జర్నలిస్టు బుధవారం సామాజిక మాధ్యమాల
వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన విజ§్‌ు అభిమానులు ఆమెపై విమర్శల
వర్షం కురిపించారు. దీంతో ఆమె విమర్శల పరంపరపై ఆమె చెన్నైలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను
ఆశ్రయించారు. ఈ సందర్భంగా తమిళ నటుడు విజ§్‌ు మహిళలను కించపరచే విధంగా పోస్టులు
పెట్టవద్దంటూ అభిమానులను కోరారు. సామాజిక మాధ్యమాల్లో వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే
స్వేచ్ఛ మహిళలకు ఉందని, మహిళలను కించపరచే సంస్కృతికి తనది కాదని విజ§్‌ు చెప్పారు.
తనకు మహిళలు అంటే ఎంతో గౌరవమని, అలాగే ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉందన్నారు.