మహిళలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి

rajagopal reddy, laxmi reddy
rajagopal reddy, laxmi reddy

నల్గొండ: మహిళలకు సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి అన్నారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఆమె ఎమ్మెల్సీగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..ప్రజల అభిమానం తమ కుటుంబంపై ఉందని తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన భర్త రాజగోపాల్‌రెడ్డికి తోడుగా ప్రజా సేవ చేయాలనేది తన కోరిక అని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/