మహావార్త-తీర్పుదినం

prayer1
prayer

మహావార్త-తీర్పుదినం

ఏదైనా ఒక వస్తువు పెద్దదనిగాని, ప్రాముఖ్యమైనదనిగాని అన్నప్పుడు నిజానికి ఆ వస్తువ్ఞ పెద్దదిగాను, ప్రాముఖ్యమైనదిగాను ఉండాలి. ముఖ్యంగా సర్వసృష్టికర్తయైన అల్లాహ్‌యే ఒక విషయాన్ని గురించి గొప్పగా ప్రశంసించినపుడు మరి ఆ విషయం నిజంగా ఎంతో గొప్పగా ఉంటుంది కదా! ‘ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలోపడి, విముఖత చూపుతున్నారు (21:1) లెక్కల ఘడియ అంటే ప్రళయదినం అని భావం. ఆ సమయం క్షణక్షణం దగ్గర పడుతోంది. రాబోయే ప్రతి సమయం దగ్గరలో ఉన్నట్టే లెక్క. ఆ మాటకొస్తే మృత్యువ్ఞ కూడా ప్రతి వ్యక్తి పాలిట ఒక ప్రళయం లాంటిదే. అదలా ఉంచితే గడచిపోయిన కాలం దృష్ట్యా ప్రళయఘడియ దగ్గర పడుతోంది. మిగిలి ఉన్నకాలం గడచిన కాలం కన్నా చాలా తక్కువ. వారు ప్రాపంచిక వ్యామోహంలో పడి తీర్పుదినం కొరకు సమకూర్చుకోవలసిన ‘సామాగ్రి పట్ల అశ్రద్ధ చూపుతున్నారు.

ఎప్పుడైతే దైవం ఏదైనా ఒక విషయాన్ని గొప్పవిషయం అన్నారంటే దాని అర్ధం ఏమంటే నిజానికి ఆ విషయం ఎంతో గొప్ప విషయంగానే ఉంటుంది. అది ప్రపంచంలోనే పెద్దవార్తగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు ే హజ్రత్‌ ఆదమ్‌ అలైహిస్సలాంకు దేవతలు అల్లాహ్‌ చేయడానికి నిరాకరించాడు. ఇది అంతపెద్ద వార్తేమీ కాదు. ే హజ్రత్‌ ఆదం అలైహిస్సలాం స్వర్గాన్నుండి భూమ్మీదకు పంపించబడ్డారు. ఇది కూడా అంత ప్రాముఖ్యమైన వార్తకాదు. ే హజ్రత్‌ నూహ్‌అలైహిస్సలాం కాలంలో ప్రపంచమంతా వరదల్లో మునిగిపోయింది. అది కూడా అంతపెద్ద సమాచారం కాదు. ే సమూద్‌వంశనాశనానికి మూలమైన భయంకర విపత్తు పెద్దవార్తకాదు. ే అద్‌వంశ నాశనానికి ములమైన భయంకర విపత్తు కూడా పెద్దవార్త కాదు. ే షుఐబ్‌ వంశనాశనానికి మూలమైన భయంకర విపత్తు కూడా పెద్ద వార్తకాదు. ే హజ్రత్‌ మూసాఅలైహిస్సలాం యొక్క ప్రార్థనా ప్రభావంతో దుర్మార్తులైన ఫిర్‌ఔన్‌ తన వంశపువారితో నడిసముద్రంలో మునిగిపోవడం కూడా గొప్పవార్తేమీ కాదు. ే హజ్రత్‌ ఈసా అలైహిస్సలా (ఏసుక్రీస్తు) ఆకాశంలోకి ఎత్తబడటం ఇది కూడా గొప్పవార్త కాదు.

ముహమ్మద్‌ సల్లల్లాహం అలైహివసల్లం దైవప్రవక్తగా నియుక్తులు కాగానే దేవ్ఞని ఏకత్వం (తాహీద్‌), ప్రళయం (ఖియామత్‌), మరణానంతర జీవితం గురించి ప్రజలకు బోధపరచటం మొదలుపెట్టారు. అవిశ్వాసులు ముఖ్యంగా మరణించిన తర్వాత మళ్లీలేపబడాన్ని వారు తిరస్కరించేవారు, ఎగతాళి చేసేవారు. అయితే దివ్యఖుర్‌ఆన్‌ అవిశ్వాసులకు వారు వినడానికి ఇష్టపడని గొప్పవార్తను తెలియజేసింది. ఆ వార్త-మనిషి చేసిన పనులకు బాధ్యత వహించవలసి ఉంటుంది. సత్యతిరస్కారుల వాదనను తిప్పికొట్టడానికి అల్లాహ్‌ శక్తిసామర్థ్యాలను, ప్రకృతిలో కనిపించే దృష్టాంతాలను వివరించడం జరిగింది. అల్లాహ్‌ భూమిని పరచి మనిషికి నివాసయోగ్యంగా చేశాడు.

భూమి తొణకకుండా దానిపై పర్వతాలను నిలబెట్టాడు. ఆయన మనలను జంటలుగా సృష్టించాడు. ఆయన మనపై ఏడు ఆకాశాలను నిలబెట్టాడు. ఆకాశంలో దీపంగా సూర్యుడిని ఉంచాడు. మేఘాల నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. తీర్పుదినం స్వచ్ఛమైన సత్యం, మంచీచెడులను వేరుచేసే రోజు. ప్రతి ఒక్కరు తప్పక చవిచూసేరోజు ఈ విషయాలను తెలుపుతూ నరకాగ్నిని కూడా వర్ణించడం కూడా జరిగింది. సత్యాన్ని తిరస్కరించిన వారికి, తీర్పుదినాన్ని కాదన్న వారికి నరకాగ్ని ఒక మాటువంటిదని చెప్పడం జరిగింది. నరకంలో వారికి నల్లని, జుగుప్పాకరమైన సలసలకాగే ద్రవం ఇవ్వబడుతుంది. అక్కడ చల్లని నీడకాని, చల్లని పానీయం కాని దొరకదు. మరోవైపు స్వర్గవనాలను వర్ణిస్తూ మనోహరమైన ఉద్వానవనంగా పేర్కొనడం జరిగింది. అక్కడ వారికి సమవయస్కులైన కన్యలు ఉంటారు. కొంతమంది విద్వాంసుల అభిప్రాయం ప్రకారం అవిశ్వాసంతోపాటు విశాసులు కూడా ఈ ‘మహావార్తను గురించి ప్రశ్నించేవారు. అయితే విశ్వాసులు మాత్రం తమ విశ్వాసాన్ని నమ్మకాన్ని మరింత దృఢతరం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రశ్నించేవారు.

– షేఖ్‌ అబ్దుల్‌హఖ్‌