మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తాం

PAWAN
PAWAN

విజయవాడ: భూ దోపిడిపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేస్తామని జనసేన అధినేత పవన్‌ అన్నారు. 2013 భూ సేకరణ చట్టం-పరిరక్షణ పేరిట విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..ఏపి సియం చంద్రబాబు తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అందరం వచ్చి సియం ఇంటి వద్ద కూర్చుంటామని పేర్కొన్నారు. అమరావతిని ఆపేస్తాం…రాజధానిని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. కేసులు పెడితే ఎదురు తిరగండి. మీకు అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తులపై ఆలోచిస్తా..ఇప్పుడు ఉద్యమాలేనని వివరించారు.