‘మహానుభావుడు’ ఫస్ట్‌లుక్‌ విడుదల

SARVANAND-1
SARVANAND

‘మహానుభావుడు’ ఫస్ట్‌లుక్‌ విడుదల

మంచి కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శర్వానంద్‌ హీరోగా, ఒక్క చిత్రంతోనే యూత్‌ హార్ట్‌బీట్‌గా మారిన మొహరిన్‌ హీరోయిన్‌గా క్రేజీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి మహానుభావుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.. ఒక్కడ సాంగ్‌ మినహా షూటింగ్‌ పూర్తచేసుకున్న ఈచిత్రం ప్రసుత్తం శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.. గురువారం నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది..ఇటలీ, ఆస్ట్రియా, క్రొయెషియా లాంటి విదేశాల్లో మరియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌ లో అందమైన లొకేషన్స్‌లోషూటింగ్‌ జరుపుకుంది.. ఆగస్టు 24న ఈచిత్రానికి సంబంధించి మొదటిలుక్‌ అండ్‌ మొదటి లుక్‌ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, రన్‌ రాజా రన్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా చిత్రాల తర్వాత శర్వానంద్‌ హీరోగా చేస్తున్న 3వ చిత్రం మహానుభావుడు అన్నారు.. మారుతి చెప్పిన కేరక్టరేజైషన్‌ దాని నుంచి వచ్చిన కామెడీ చాలా బాగా నచ్చి వెంటనే చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఆగస్టు 24న మొదటి లుక్‌ను, మొదటి లుక్‌ టీజర్‌నువిడుదల చేయనున్నామని తెలిపారు..
దర్శకుడు మారుతి మాట్లాడâత, భలేభలే మగాడివో§్‌ు చిత్రం తర్వాత తనకు బాగా నచ్చిన కేరక్టరైజేషన్‌తో చేస్తున్న చిత్రమిదని అనానరు.. అన్ని పక్కాగా అనుకున్న తర్వాత ఈచిత్రం సెట్‌మీదకు వెళ్లామన్నారు.. శర్వానంద్‌ కెరీర్‌లో ఈచిత్రం బెస్ట్‌ చిత్రం అవుతుందన్నారు.. శర్వానంద్‌ బాగా చేశాడని, ఫుల్‌ కామెడీ ఉంటుందని అన్నారు.. థమన్‌ మంచి సంగీతం అందించారని తెలిపారు. మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా ఈచిత్రం ఉంటుందన్నారు.. దసరాకి చిత్రం విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలుచేస్తున్నారని తెలిపారు. శర్వానంద్‌, మొహరిన, వెన్నెల కిషోర్‌ , నాజర్‌, భద్రం, కళ్యాణి నటరాజ్‌, పిజ్జాబా§్‌ు, భాను, హిమజ, వేణు, సుదర్శన్‌, సాయి వెంకీ, శంకర్‌రావు , రమాదేవి, మధుమణి , రాగిణి, రజిత, అబ్బులు చౌదరి, సుభాష్‌ , ఆర్‌కె. ప్రధాన తారాగణం.