మహాత్మా మోడీని తొలగించు…!

mamata
mamata

గాంధీ విగ్రహం ముందుమమతా ప్రార్ధనలు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ముఖ్యమంత్రి తృణమూల్‌కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వినూత్ననిరసన ప్రకటించారు. బుధవారం ప్రతిపక్ష పార్టీల మెగా ర్యాలీ సందర్భంగా ఢిల్లీకి వచ్చిన మమతా ముందు మహాత్మాగాంధీ వద్ద నివాళులర్పించి అనంతరం ప్రధాని మోడీని తొలగించాలని ప్రార్ధనలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షిఇంచారు. పార్లమెంటువద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న మమత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రధాని నరేంద్రమోడీని తొలగించాలని మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్నిసైతం ఓడించాలని ప్రార్ధించారు. బడ్జెట్‌చివరి సమావేశాలసందర్భంగా పార్లమెంటుకు వచ్చిన టిఎంసి చీఫ్‌బెనర్జీ మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీకి తన సొంత సిద్ధాంతాలుంటాయని, తమకు దేశభక్తిపై నమ్మకం ఉందని తాను మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిలుచుని ప్రార్ధించేందుకే పార్లమెంటుకు వచ్చానని పేర్కొన్నారు. దేశాన్ని, దేశసమైక్యతను కాపాడాలని మహాత్మాగాంధీ విగ్రహం వద్దప్రార్ధించానన్నారు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకపోరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రిచంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ కూడగట్టి మహాకూటమిగా ఏర్పాటుకు ఆమె తనవంతు కృషిచేసారు. 2019ఎన్నికల్లో బిజెపి ఓటమికి ఇదే సరైన తరుణమని ఆమె పిలుపునిచ్చారు. కొద్దిరోజులక్రితమే పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కత్తా కమిషనర్‌ను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించేందుకు వచ్చిన సిబిఐ అధికారులపై మమతా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆమె సత్యాగ్రహాన్ని సైతం నిర్వహించారు. సిబిఐ అధికారులు కమిషనర్‌ నివాసంలోనికి రానీయకుండా అడ్డుకున్నారు. కేంద్రంతో తన పోరునున నిలిపివేయకుండా మమతాబెనర్జీ ఢిల్లీలో ఆప్‌ అధినేత అరవింద్‌కేజ్రీవాల్‌ నిర్వహించిన ర్యాలీకిసైతం హాజరయ్యారు.