మహబూబాబాద్‌ పర్యటనలో డిజిపి

DGP Mahendera Reddy
DGP Mahendera Reddy

మహబూబాబాద్‌: రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ మహబూబాబాద్‌కు వచ్చారు. ఆయనకు ఎస్పీ కోటిరెడ్డి స్వాగతం పలికారు . అనంతరం ఎస్పీ నూతన కార్యాలయ భవనం కోసం పట్టణం శివారులోని గుమ్ముడూరు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐజి నాగిరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ రావుల గిరిధర్‌ పాల్గొన్నారు.