మళ్లీ రచ్చ స్టార్ట్‌

Taapsi
Taapsi

మళ్లీ రచ్చ స్టార్ట్‌

ఏదైనా సినిమా వస్తోందంటే చాలు. ప్రచారం కోసం నానా రకాల టెక్నిక్స్‌ అమలు చేయటం కామన్‌ అయిపోయింది.. ముఖ్యంగా వివాదం సృస్టించే మాటలు మాట్లాడ్డంతో కాంట్రవర్సీ క్రియేట్‌ చేసి అనాల్సింది అనేయటం ..ఇటుసినిమాకు ప్రచారం.. రెండు విధాల ప్రచారం వచ్చేస్తోంది అంటున్నారు.. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నుకూడ ఇలాంటి ఐడియాలు బాగానే చేస్తోందంటున్నారు.. సామాన్యంగా సైలెంట్‌గానే ఉండే ఈసుందరి, కొత్తసినిమా రిలీజ్‌ దగ్గర పడేకొద్దీ ఏదో ఒక పాయింట్‌ ను ఫోకస్‌ చేస్తూఉంటుంది.. ఇపుడు దిల్‌ జంగ్లీ అనే సినిమా వస్తుండ టంతో ఇంకో టాపిక్‌ గుర్తించి స్టార్ట్‌ చేసింది.. అందుకే ఇపుడు సినిమా రంగంలో వారసత్వం గురించి కబుర్లు స్టార్ట్‌ చేసేసింది.. ఎంతో కష్టపడి పైకొచ్చేవారికంటే.. తారల వారసులు సినిమాల్లోకి రావటం ఈజీగా ఉంటోందని, మీడియా అటెన్షన్‌ కూడ వారిపై ఎక్కువగా ఉంటోందని, ఏం సాధించకుండానే వారికి బోలెడంత ప్రచారం వచ్చేస్తోందని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..